Anni Manchi Sakunamule | టాలీవుడ్ యువ హీరో సంతోష్ శోభన్ (Santosh Soban) నటిస్తున్న తాజా చిత్రాల్లో ఒకటి అన్నీ మంచి శకునములే (Anni Manchi Sakunamule). నందినీ రెడ్డి డైరెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి సీతాకళ్యాణ వైభోగమే (Sita Kalyanam Lyrical Video), అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్స్ ను మేకర్స్ విడుదల చేయగా.. అందరిని ఆకట్టుకుంటున్నాయి.
తాజాగా గల గల యేరులా లిరికల్ వీడియోసాంగ్‌ను లాంఛ్ చేశారు. ఇటలీలో హీరోహీరోయిన్ల మధ్య సాగే ట్రాక్‌తో నడుస్తున్న ఈ పాట మ్యూజిక్ లవర్స్ ను ఇంప్రెస్ చేస్తోంది. రెహ్మాన్ రాసిన ఈ పాటను నకుల్ అభ్యంకర్, రమ్య భట్ అభ్యంకర్ పాడారు. మిక్కీ జే మేయర్ కంపోజ్ చేశాడు.
రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. నరేశ్, రాజేంద్రప్రసాద్, రావురమేశ్, గౌతమి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని స్వప్నాదత్, ప్రియాంకా దత్ స్వప్నా సినిమా బ్యానర్‌పై మిత్రవింద ఫిలిమ్స్ బ్యానర్‌తో కలిసి తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. వెన్నెల కిశోర్, అర్జుణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంతోష్ శోభన్ మరోవైపు ప్రేమ్ కుమార్, శ్రీదేవి శోభన్ బాబు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఈ చిత్రం మే 18న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
గల గల యేరులా లిరికల్ వీడియో సాంగ్..
సీతాకళ్యాణ వైభోగమే లిరికల్ వీడియో సాంగ్..
అన్నీ మంచి శకునములే టైటిల్ సాంగ్..
OG | ఓజీ సెట్స్‌లో పవన్ కల్యాణ్.. స్టైలిష్ లుక్‌తో ఫ్యాన్స్ ఖుషీ
Anni Manchi Sakunamule | అన్నీ మంచి శకునములే నుంచి గల గల యేరులా లిరికల్ వీడియో సాంగ్