Shriya Reddy | ఏ మాత్రం తగ్గేదేలే అంటూ హీరోలు, విలన్లతో పోటీ పడి మరి నటించే అతికొద్ది మంది నటీమణుల్లో టాప్‌లో ఉంటుంది శ్రియారెడ్డి. క్యారెక్టర్ ఏదైనా సినిమాలో ఉండే పాత్రలను డామినేట్ చేసేలా శ్రియారెడ్డి యాక్టింగ్ ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇటీవలే పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన ఓజీ (OG)లో పవర్ ఫుల్ రోల్లో నటించింది.
ఫిట్నెస్ను మెయింటైన్ చేసే విషయంలో చాలా మంది యాక్టర్లకు స్పూర్తిగా నిలిచే శ్రియారెడ్డి సలార్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు షేర్ చేసుకుంది. యాక్టింగ్ చేసేందుకు వెళ్లే ముందు కూడా పుష్ అప్స్ చేసేదాన్ని అని చెప్పింది. ఓ షాట్ తీసే ముందు ప్రతీసారి 50-60 పుష్ అప్స్ చేసేదాన్ని. నా క్యారవాన్‌లో కాస్ట్యూమ్స్ సమయంలో ఇలా చేయడం నా రొటీన్ దినచర్య. పుష్ అప్స్ ప్రాథమికంగా నేను చేసే చాలా సులభమైన వర్కవుట్.
షాట్‌కు అంతా రెడీ అయిందని లొకేషన్ నుంచి నాకు ఫోన్ వస్తే కొంత సమయం కావాలని రిక్వెస్ట్ చేసేది. అందుకే నా వర్కవుట్ పూర్తి చేసి వెంటనే షాట్‌కు పరిగెత్తేదాన్ని. నా వర్కవుట్ సెషన్‌తో కొత్త ఎనర్జీ వచ్చిన భావన కలుగుతుంది. నేనక్కడ (ఖన్సార్)లో చాలా మంది పురుషుల మధ్య నిలబడినప్పుడు నన్ను నేను అజేయురాలిగా భావించాలంటే.. నేను లోపలి నుంచి ఆ ఫీల్‌ను అనుభవించాలి.. అంటూ చెప్పుకొచ్చింది. శ్రియా రెడ్డి నెక్ట్స్ సలార్ 2లో కనిపించనుంది.
Actor Srikanth Bharat | మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టాలీవుడ్ నటుడు
The Paradise | దసరా డైరెక్టర్‌తో ‘కిల్’ రాఘవ.. నాని ది ప్యారడైజ్‌పై సూపర్ హైప్