Shraddha Kapoor | బాలీవుడ్లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ భామల్లో శ్రద్దాకపూర్ ఒకరు. ఈ భామ హార్రర్ థ్రిల్లర్ జోనర్లో నటించిన స్త్రీ 2 బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. స్క్రిప్టుల ఎంపికలో ఆచితూచి వ్యవహరించే ఈ భామకు సంబంధించిన కొత్త వార్త ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. శ్రద్దాకపూర్ ఈ సారి ఫాంటసీ సినిమాకు ఒకే చెప్పిందట.
పహడ్పంగిర (Pahadpangira) టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు రహి అనిల్ బర్వే దర్శకత్వం వహించనున్నాడు. ఫెమినిజం బ్యాక్ డ్రాప్ స్టోరీతో రాబోతున్న ఈ చిత్రాన్ని ఏక్తాకపూర్ తెరకెక్కించనుందని బీటౌన్ సర్కిల్ సమాచారం. పురాణం, జానపద కథల నేపథ్యంలో సాగే ఫాంటసీ నేపథ్య కథ అట.
ఇండియన్ సినిమాలో ఉన్న బెస్ట్ హార్రర్ థ్రిల్లర్ ప్రాజెక్టుల్లో టాప్‌లో ఉంటుంది Tumbbad. తాజా టాక్ ప్రకారం రహి అనిల్ ఈ చిత్రాన్ని తుంబాడ్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కించాలని అనుకున్నాడట. అయితే యాక్టర్ కమ్ ప్రొడ్యూసర్ సోహమ్ షాతో వచ్చిన విబేధాల కారణంగా ఈ ఆలోచన నుంచి విరమించుకున్నాడని బీటౌన్ సర్కిల్ సమాచారం. మరి పహడ్పంగిరకు సంబంధించి శ్రద్దాకపూర్ టీం నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.
Read Also :
OG | థియేటర్లలో ‘ఓజీ’ ఘన విజయం ..ఇప్పుడు ఓటీటీ రిలీజ్‌పై స్పెషల్ ఫోకస్..!
Ed Sheeran | ఇంటర్నేషనల్ కోలాబరేషన్.. బ్రిటీష్ పాప్ సింగర్‌తో సంతోష్ నారాయణన్ ఇండియన్ ఆల్బమ్
Tanuj Mouli | రూ. కోటి అడ్వాన్స్.. ‘లిటిల్ హార్ట్స్’ హీరోకి మైత్రీ మూవీ మేకర్స్ నుంచి భారీ ఆఫర్.