పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాజెక్టుల్లో ఒకటి ప్రాజెక్ట్ K (project k). ప్రభాస్ (Prabhas) నటిస్తోన్న వన్ ఆఫ్ ది పాన్ ఇండియా సినిమా ప్రాజెక్ట్ K. సైన్స్ ఫిక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు. దీపికాపదుకొనేకు తెలుగులో ఇది మొదటి చిత్రం కావడం విశేషం.
ఇప్పటికే దీపికా పదుకొనే పుట్టినరోజు సందర్భంగా ప్రాజెక్ట్ K నుంచి లాంఛ్ చేసిన లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా ఈ మూవీకి దీపికా పదుకొనే తీసుకుంటున్న రెమ్యునరేషన్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. దీపికా పదుకొనే ఈ చిత్రానికి రూ.10 కోట్లు పారితోషికం తీసుకుంటుందని తాజా రిపోర్ట్స్ టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన వస్తే క్లారిటీ వచ్చే అవకాశముంది. ఈ చిత్రాన్ని వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై అశ్వినీదత్ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రాజెక్ట్ K రూ.500 కోట్ల బడ్జెట్‌తో రాబోతున్నట్టు ట్రేడ్ సర్కిల్ టాక్. 2024 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ప్రభాస్ మరోవైపు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో సలార్ సినిమాలో నటిస్తున్నాడు. మరోవైపు టాలీవుడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో హార్రర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. అదేవిధంగా ఓం రౌత్ దర్శకత్వంలో మైథలాజికల్ డ్రామా ఆదిపురుష్‌లో కూడా నటిస్తున్నాడు.
హాలీవుడ్ రేంజ్లో దీపికాపదుకొనే లుక్..
Here's wishing our @deepikapadukone a very Happy Birthday.#ProjectK #HBDDeepikaPadukone pic.twitter.com/XfCbKapf25
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) January 5, 2023
Read Also :
Nelson Dilipkumar | నెల్సన్ దిలీప్ కుమార్‌కు స్టార్ హీరో వెస్పా స్కూటర్ గిఫ్ట్.. స్పెషల్ ఏంటో..?
Bimbisara 2 | క్రేజీ టాక్.. కల్యాణ్ రామ్ బింబిసార 2 డైరెక్ట్ మారాడా..?
Ghosty | కాజల్ అగర్వాల్ ఘోస్టీ ఇంట్రెస్టింగ్ అప్డేట్