Nelson Dilipkumar | నెల్సన్ దిలీప్ కుమార్‌కు స్టార్ హీరో వెస్పా స్కూటర్ గిఫ్ట్.. స్పెషల్ ఏంటో..?
నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ప్రస్తుతం తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో యాక్షన్ కామెడీ డ్రామా నేపథ్యంలో జైలర్ (Jailer) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ ఓ స్టార్ హీరో నుంచి అరుదైన బహుమతి అందుకున్నాడు.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ (Nelson Dilipkumar) ప్రస్తుతం తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో జైలర్ (Jailer) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. యాక్షన్ కామెడీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ నటుడు జాకీష్రాఫ్, కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ ఈ చిత్రంలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
తాజాగా నెల్సన్ దిలీప్ కుమార్ ఓ స్టార్ హీరో నుంచి అరుదైన బహుమతి అందుకున్నాడు. బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ (Jackie Shroff) యెల్లో వెస్పా స్కూటర్‌ను డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్‌కు బహుమతిగా అందించాడు. ఎంతో విలువైన కానుక అందుకున్న విషయాన్ని ఇన్‌స్ట్రాగ్రామ్ స్టోరీ ద్వారా షేర్ చేశాడు నెల్సన్ దిలీప్ కుమార్. అయితే నెల్సన్‌కు జాకీ ష్రాఫ్ స్కూటీ గిఫ్ట్‌గా అందించడం వెనకున్న స్పెషల్ ఏంటనేది మాత్రం తెలియాల్సి ఉంది.
జైలర్‌లో తమన్నా భాటియా, సునీల్, రమ్యకృష్ణ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన మోహన్‌లాల్, సునీల్, తమన్నా ఫస్ట్ లుక్ పోస్టర్లు నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సన్ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. గతేడాది విజయ్ హీరోగా బీస్ట్ సినిమా తెరకెక్కించాడు నెల్సన్ దిలీప్ కుమార్. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది.

Read Also :
Gandeevadhari Arjuna | స్పీడుమీదున్న వరుణ్‌తేజ్.. గాండివధారి అర్జున తాజా అప్డేట్
Bimbisara 2 | క్రేజీ టాక్.. కల్యాణ్ రామ్ బింబిసార 2 డైరెక్ట్ మారాడా..?
Ghosty | కాజల్ అగర్వాల్ ఘోస్టీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Asian Para Games | ఆసియా పారా క్రీడల్లో భారత్ సరికొత్త చరిత్ర.. 114 పతకాలతో రికార్డు!
India vs Zimbabwe ODI | షఫాలీ విధ్వంసం.. రావల్ శతకం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం!
firecracker factory explodes | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. నలుగురు మృతి
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

