టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్‌తేజ్ (Varun Tej) ఫుల్ స్పీడుమీదున్నాడు. ఈ మెగా హీరో నటిస్తున్న రెండు సినిమాలు ప్రస్తుతం సెట్స్ పై ఉన్న విషయం తెలిసిందే. వీటిలో ఒకటి VT 12. ఈ చిత్రానికి గాండివధారి అర్జున (Gandeevadhari Arjuna) టైటిల్ ఫిక్స్ చేయగా.. ఇప్పటికే లాంఛ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్డేట్ అందించి అందరిలో జోష్ నింపుతున్నాడు వరుణ్ తేజ్.
థ్రిల్లింగ్‌గా సాగే మిషన్‌తో బ్యాక్ టు యాక్షన్.. గాండివధారి అర్జున టీం హై ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్ తో కొత్త షెడ్యూల్ మొదలుపెట్టింది.. అంటూ ఫైర్ ఎమోజీని పోస్ట్ చేశాడు వరుణ్ తేజ్. లొకేషన్ లో డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు, వరుణ్ తేజ్ అండ్ టీం మానిటర్ చెక్ చేసుకుంటున్న స్టిల్‌ను మేకర్స్ షేర్ చేయగా.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ జోనర్లో తెరకెక్కుతున్న ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది. విమలారామన్, నాజర్, వినయ్ రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
మరోవైపు వరుణ్ తేజ్ నటిస్తున్న VT 13 సినిమా అప్డేట్స్ కూడా ఒకదాని వెనుక మరొకటి బయటకు వస్తున్నాయి. ఈ మూవీలో మాజీ మిస్ యూనివర్స్ మానుషి ఛిల్లార్ ఫీ మేల్ లీడ్ రోల్లో కనిపించబోతుందంటూ ఓ వార్తను కూడా షేర్ చేసుకున్నారు మేకర్స్. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న VT13 చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్నాడు. సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న VT13 ఈ ఏడాది చివరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
లొకేషన్ లో వరుణ్ తేజ్ అండ్ టీం..
Back in Action with a Thrilling Mission!😎
Team #GandeevadhariArjuna kick-starts a new schedule to shoot some blazing high octane action sequences ❤️🔥@IAmVarunTej @PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/xvIA1kHtJC
— SVCC (@SVCCofficial) March 6, 2023
గాండివధారి అర్జున మోషన్ పోస్టర్..
Introducing the Envoy of peace with an M4 Carbine 🔥
Presenting Mega Prince @IAmVarunTej in a Never Seen Before Avatar as #GandeevadhariArjuna 😎
– https://t.co/FbN30VGgtv#HBDVarunTej ❤🔥@PraveenSattaru @MickeyJMeyer @BvsnP @SVCCofficial pic.twitter.com/suOAC1fikU
— SVCC (@SVCCofficial) January 19, 2023
Read Also :
Dasara | దసరా మూడో సాంగ్.. ఛమ్కీలా అంగీలేసి ప్రోమో అదిరింది
Ghosty | కాజల్ అగర్వాల్ ఘోస్టీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
Saindhav | వెంకటేశ్ సైంధవ్‌లో హీరోయిన్ ఫైనల్.. ఇంతకీ ఎవరో తెలుసా..?