టాలీవుడ్ న్యాచురల్ స్టార్ నాని (Nani) ప్రస్తుతం దసరా (Dasara) సినిమా చేస్తున్నాడని తెలిసిందే. పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన దసరా టీజర్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన రెండు పాటలకు మంచి స్పందన వస్తోంది. ఇప్పుడు మూడో సాంగ్ అప్డేట్ అందించారు మేకర్స్. ఛమీకీలా అంగిలేసి ఓ వదినే (Chamkeela Angeelesi Song Promo) అంటూ సాగే మూడో సాంగ్ ప్రోమోను లాంఛ్ చేశారు మేకర్స్.
కాసర్ల శ్యామ్ రాసిన ఈ పాటను సంతోష్ నారాయణన్ కంపోజ్ చేయగా.. రామ్ మిర్యాల, DHEE పాడారు. పక్కా పల్లెటూరి థీమ్‌తో నాని, కీర్తిసురేశ్ డీగ్లామరైజ్డ్ లుక్‌లో సాగే ఈ పాట మ్యూజిక్ లవర్స్ ఎంజాయ్ చేసేలా ఉండబోతుందని ప్రోమోతో తెలిసిపోతుంది. ఫుల్ సాంగ్‌ను మార్చి 8న విడుదల చేయనున్నట్టు తెలియజేశారు మేకర్స్. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గని బ్యాక్‌డ్రాప్ విలేజ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది దసరా. ఈ మూవీలో నేషనల్ అవార్డు విన్నింగ్ నటి కీర్తిసురేశ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. దసరాలో సాయికుమార్, సముద్రఖని, జరీనా వహబ్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
దసరా చిత్రాన్ని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే దసరా నుంచి విడుదలైన ధూమ్ ధాం దోస్తాన్ పాట నెట్టింటిని షేక్ చేస్తోన్న విషయం తెలిసిందే. దసరా మార్చి 30న ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఛమీకీలా అంగిలేసి ఓ వదినే ప్రోమో..
స్టన్నింగ్ మాస్ టీజర్‌పై ఓ లుక్కేయండి..
#Dasara Third Single promo out now 🥁
– https://t.co/QIfZG7Sk0f#ChamkeelaAngeelesi #MainaruVettiKatti #ChamkeeliBushirtMein #HoovinaAngiThottu #PalaPalaaMinnerunne
Full Song on March 8th 🥁@NameisNani @KeerthyOfficial @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/HZlCeEqeOQ
— SLV Cinemas (@SLVCinemasOffl) March 6, 2023
Read Also :
Ghosty | కాజల్ అగర్వాల్ ఘోస్టీ ఇంట్రెస్టింగ్ అప్డేట్
Saindhav | వెంకటేశ్ సైంధవ్‌లో హీరోయిన్ ఫైనల్.. ఇంతకీ ఎవరో తెలుసా..?