Tamil CM : ధరాపురం (Dharapuram) ఉపఎన్నికల ప్రచారంలో టీవీకే అభ్యర్థి (TVK Candidate) సత్యభామ (Satyabhama) పై డీఎంకే అధినేత (DMK chief), తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి (Tamil Ex CM) ఎంకే స్టాలిన్ (MK Stalin) చేసిన వ్యక్తిగత వ్యాఖ్యలను తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ (Joseph Vijay) తీవ్రంగా ఖండించారు. ఎన్నికల ప్రచార అంశాలను పక్కనపెట్టి, ఒక మహిళా అభ్యర్థిపై బాడీ షేమింగ్ (Body Shaming) కు పాల్పడటం దారుణమని ఆయన మండిపడ్డారు.
ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వ్యాఖ్యలకు తావులేదని సీఎం విజయ్ అన్నారు. మహిళలపై డీఎంకే నేతలు అసభ్యకరమైన, అవమానకరమైన భాషను ఉపయోగించడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని చెప్పారు. మాజీ సీఎం స్టాలిన్ వ్యాఖ్యలు డీఎంకే పార్టీలో పాతుకుపోయిన విద్వేష, అసభ్యకరమైన సంస్కృతిని ప్రతిబింబిస్తున్నాయని ఆయన ఆరోపించారు.
ఈ విషయంలో తాను సత్యభామకు అండగా నిలుస్తున్నట్లు విజయ్ ప్రకటించారు. కేవలం ఒక రాజకీయ నాయకుడిగానే కాకుండా తమిళనాడులోని మహిళలకు ఒక కొడుకుగా, అన్నగా, తమ్ముడిగా ఈ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని అన్నారు. అక్టోబర్ 6న జరగనున్న ఉపఎన్నిక నేపథ్యంలో టీవీకే, డీఎంకే మధ్య మాటల యుద్ధం మరింత తీవ్రస్థాయికి చేరింది.