Akhil- Zainab | టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీ అక్కినేని కుటుంబం నుంచి మరో కథానాయకుడు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. నాగార్జున రెండో తనయుడు అఖిల్ వివాహం జైనబ్‌తో జూన్ 6న ఘనంగా జరిగింది. నాగార్జున నివాసంలో ప్రైవేట్‌గా ఈ వివాహం జరుగగా.. ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబసభ్యులు, సన్నిహితులు, సినీతారలు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. అయితే జూన్ 06న పెళ్లి చేసుకున్న ఈ జంట జూన్ 08న ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా రిసెప్షన్ జరుపుకుంది.
ఈ వెడ్డింగ్ రిసెప్షన్ కి సినీ, రాజకీయ ప్రముఖులు తరలి వచ్చారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీతో పాటు, కేజీఎఫ్ స్టార్ యష్, తమిళ నటుడు సూర్య, వెంకీ అట్లూరి, నాచురల్ స్టార్ నాని తదితరులు వచ్చి ఈ వేడుకలో సందడి చేశారు. అయితే ఈ వేడుకలో సూపర్ స్టార్ మహేశ్ బాబు ధరించిన టీషర్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది. హీర్మేస్ బ్రాండ్ (Hermes brand) టీషర్ట్ ధరించిన మహేష్ బాబు అఖిల్ రిసెప్షన్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. అయితే మహేశ్ వేసుకున్న టీషర్ట్ గురించి అతడి అభిమానులు ఇంటర్నెట్లో వెతకడం మొదలుపెట్టారు. దీని ధర చూస్తే.. 1775 అమెరికాన్ డాలర్లుగా ఉండగా.. ఇండియాలో ఈ టీషర్ట్ ధర దాదాపు రూ.లక్ష 54 వేలుగా ఉంది. కాగా ఈ టీషర్ట్ ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Anna oka sweatshirt £1,338.34 ( 1,54,873.11 inr) ah 🙄🙄
Nuvu vesukoni giveaway evvochu kada anna @urstrulyMahesh #SSMB29 #MaheshBabu𓃵 #MaheshBabu #AkkineniAkhil #AkhilZainab #AkhilZainabReception #akhilzainabwedding pic.twitter.com/VhhXnmtpEK
— Nellore Pedda Reddy 🔥 (@PeddaReddy02) June 8, 2025