Manchu Manoj – Sadha | 2004లో వచ్చిన దొంగ దొంగది చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మంచు మనోజ్, సదా జంటగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకి మంచి వినోదం పంచింది. తెరపై వారి కెమిస్ట్రీ, కామెడీ టైమింగ్‌కు అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ ఇద్దరు కలిసి పని చేస్తూ చూడాలని ఫ్యాన్స్ భావించారు. కాని ఆ తర్వాత వీరు కలిసి ఏ వేదికపై కూడా కనిపించలేదు. ఇన్నేళ్ల తర్వాత ఒకే ఈవెంట్లో కలిసి కనిపించడం ఫ్యాన్స్‌కి ట్రీట్‌లా మారింది. హీరో మంచు మనోజ్ ఇటీవల రీ-ఎంట్రీ ఇచ్చి వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
Mano
ఈ క్రమంలో, ఇటీవల జీ తెలుగు నిర్వహించిన వినాయక చవితి స్పెషల్ ఈవెంట్ ‘గం గం గణేశా’ కి మనోజ్ హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి మరో సర్ప్రైజ్ గెస్ట్‌గా హీరోయిన్ సదా కూడా వచ్చి సందడి చేసింది. ఈ స్పెషల్ కార్యక్రమంలో మనోజ్, సదా ఇద్దరూ గేమ్స్ ఆడి, పంచులేస్తూ, సందడిగా హావభావాలతో అలరించారు. ఇద్దరూ ఒకరినొకరు హత్తుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వీరి మధ్య జరిగిన నవ్వులు, చిలిపి మాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి.ఈ షో ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పూర్తి ఎపిసోడ్ నేడు, ఆదివారం సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం కానుంది.
ఇన్నాళ్ల తర్వాత మళ్లీ కలసిన మనోజ్ – సదా జంటను తెరపై చూడడం ఫ్యాన్స్‌కి మధురానుభూతిని కలిగిస్తోంది. ‘‘మళ్లీ ఈ ఇద్దరూ కలిసి నటిస్తే ఎంత బాగుంటుందో!’’ అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. మంచు మనోజ్ ఇటీవల భైరవం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ చిత్రం మల్టీ స్టారర్‌గా రూపొంది మంచి విజయం సాధించింది. మిరాయ్ అనే చిత్రంలో కూడా కీలక పాత్ర పోషించాడు మనోజ్. ఇటీవల గ్లింప్స్ విడుదల కాగా, ఇందులో మనోజ్ పాత్ర ప్రేక్షకులకి ఎంతగానో నచ్చేసింది.