న్యూ శాయంపేట, ఆగస్టు 31: వన్యప్రాణుల సంరక్షణలో ‘నేను సైతం’ అంటూ అందరికీ ఆదర్శంగా నిలిచారు లయన్ గిల్లా పురుషోత్తం (Lion Gilaa Purushottam). తమ మనువరాలు రాణీ సుమేధ (Rani Sumedha) పుట్టిన రోజున ఆయన కాకతీయ జూలాజికల్ పార్కులోని ‘మౌస్డీర్’ను దత్తత తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన 12వేల రూపాయల చెక్కును జూ సిబ్బందికి అందచేశారు.
చెక్కు ప్రదానం అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతినెల మౌస్డీర్ పోషణకు అయ్యే ఖర్చును తాము అందచేస్తామని, జంతుప్రేమికులుగా ఇలాంటి పని చేయడం ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తోందని తెలిపారు. మౌస్డీర్ను దత్తత తీసుకున్న ఆయనను జూ సిబ్బంది అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ హనుమకొండ అధ్యక్షుడు తేరాల రమేష్ బాబు, వివేకానంద, శ్రీధర్ రెడ్డి, నిర్మల, రమణరెడ్డి, సుభాష్, శ్రీనివాసులు, రాజశేఖరం, అశోక్, ప్రభాకర్, కిరణ్మయి, మోహన్ రెడ్డి, ప్రభాకర్, విశ్వేశ్వర్, ఆర్ఎఫ్వో, అటవీ సిబ్బంది పాల్గొన్నారు.