Shivam Bhaje | టాలీవుడ్ యాక్టర్ అశ్విన్ బాబు (Ashwin Babu) లీడ్ రోల్లో నటించిన ప్రాజెక్ట్ శివం భజే (Shivam Bhaje). అప్సర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ 2024 ఆగస్టు 1న గ్రాండ్‌గా విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ తెచ్చుకుంది. నిర్మాతలకు కాసుల వసూళ్లను రాబట్టింది. మాస్, యాక్షన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో శివంభజేను తెరకెక్కించిన డైరెక్టర్ అప్సర్పై మూవీ లవర్స్, నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.
కాగా అప్సర్ కష్టానికి ఫలితం దక్కింది. ప్రతిష్టాత్మక (GAMA) గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్‌లో శివంభజే చిత్రానికి మోస్ట్ అస్పైరింగ్ డైరెక్టర్‌గా అవార్డు అందుకున్నాడు. దుబాయ్‌లోని షార్జా ఎక్స్పో సెంటర్లో జరిగిన ఈవెంట్లో అప్సర్ ఈ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డుకు తనను ఎంపిక చేసిన జ్యూరీకి, నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేశాడు.
ఈ చిత్రంలో దిగంగనా సూర్యవంశీ హీరోయిన్గా నటించగా.. బాలీవుడ్ యాక్టర్ అర్బాజ్ ఖాన్ కీ రోల్ పోషించాడు. గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ మూవీది. ఈ మూవీలో హైపర్ ఆది, సాయిధీన, తులసి, దేవిప్రసాద్, అయ్యప్ప శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి వికాస్ బడిస మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించాడు.
Director #Apsar receives #GAMAAwardhttps://t.co/uc8WyvAY4Z@PROSaiSatish #GAMAAwards pic.twitter.com/fOE0aK9zXi
— Do It rIgHt NoW!!! (@Tinkusayz) September 3, 2025
Shilpa Shetty | కొత్తగా మీ ముందుకొస్తున్నాం.. రెస్టారెంట్ మూసివేతపై క్లారిటీ ఇచ్చిన శిల్పా శెట్టి
Ghaati | ఘాటి అడ్వాన్స్ బుకింగ్స్ అదుర్స్.. హాట్ కేకుల్లా అమ్ముడవుతున్న టిక్కెట్స్