Shilpa Shetty | షూ వేసుకొని జాతీయ జెండా ఎగురవేసిందంటూ ట్రోల్స్.. విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన శిల్పాశెట్టి
Shilpa Shetty | విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty). త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది.
Shilpa Shetty | విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి (Shilpa Shetty). 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్ని (Independence Day) దేశవ్యాప్తంగా మంగళవారం ఘనంగా జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇళ్లు, కార్యాలయాల వద్ద ప్రజలు జెండా వందనం (Hoisting Flag ) చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల ద్వారా షేర్ చేశారు. బాలీవుడ్ స్టార్ నటి శిల్పా శెట్టి కూడా ముంబై జుహూలోని తన నివాసంలో కుటుంబ సభ్యులతో కలిసి జెండా ఎగురవేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ లో పోస్టు చేసింది.
అయితే జెండా ఎగురవేస్తున్న సమయంలో శిల్పా కాళ్లకు షూ (Shoes) ధరించి కనిపించింది. దీంతో నటిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. జాతీయ జెండా ఎగురవేస్తున్న సమయంలో చెప్పులేసుకోవడం ఏంటి..? అంటూ ట్రోల్స్ చేశారు. దీనిపై శిల్పా స్పందించింది. త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే సమయంలో పాటించాల్సిన నిబంధనల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫ్లాగ్ కోడ్‌లో చెప్పులేసుకోకూడదన్న నియమం ఎక్కడా లేదంటూ గూగుల్ లో ఓ ఆర్టికల్‌ను వెతికి మరీ పోస్ట్ చేసింది. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడండి అంటూ విమర్శకులకు గట్టి కౌంటర్ ఇచ్చింది.
Also Read..
Upasana | క్లిన్ కారా మొదటి స్వాతంత్య్ర వేడుకలు.. ఫొటో షేర్ చేసిన ఉపాసన
Shimla | హిమాచల్‌లో కుంభవృష్టి.. సమ్మర్ హిల్ ప్రాంతంలో మరోసారి విరిగిపడ్డ కొండచరియలు
Rishi Sunak | ప్రధానిగా కాదు.. హిందువుగా వచ్చా .. రామ కథ కార్యక్రమంలో రిషి సునాక్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

