Kuberaa | శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం కుబేర. తమిళ నటుడు ధనుష్, టాలీవుడ్ నటుడు నాగార్జున, రష్మిక మందన్నా ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. పాన్ ఇండియా వైడ్‌గా ఈ చిత్రం జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్‌లో పాల్గోంటున్నాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గోన్న ఆయన 2021లో జరిగిన ఒక సంఘటన గురించి పంచుకున్నాడు. కూతురి పెళ్లి కోసం ఒక రైతు 2 లక్షలు దాచుకోగా.. ఆ డబ్బు మంటల్లో కాలిపోతే శేఖర్ కమ్ముల అతడికి ఆర్థిక సహాయాన్ని అందించాడు.
ఈ విషయం గురించి తాజాగా మాట్లాడుతూ.. కూతురి పెళ్లి కోసం ఓ రైతు దాచుకున్న డబ్బు కాలిపోయిందని తెలిసి నా కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. ఎంతో కష్టపడి సంపాదించిన ఆ డబ్బు అలా కాలిపోవడం నన్ను తీవ్రంగా కలిచివేసింది. బాగా డబ్బున్నవాడికి నోట్ల కట్టలు మంటల్లో కాలిపోతే కేవలం బాధేస్తుంది, అలాంటిది ఒక పేద రైతు కష్టపడి సంపాదించిన డబ్బు అలా కాలిపోతే అతడి బాధేంటే అర్థం చేసుకోనవసరం లేదు. అతడి కష్టం ఇలా వృథా అవ్వడం నా మనసును బాగా కదిలించింది. అందుకే ఆ రైతుకు నా వంతు సహాయంగా రూ.2లక్షలు పంపించాను. అంటూ శేఖర్ చెప్పుకోచ్చాడు.
అసలు ఏం జరిగిందంటే.. 2021లో సూర్యాపేట జిల్లా, మునగాల మండలం, నేలమర్రికి చెందిన కప్పల లక్ష్మయ్య అనే రైతు పూరిల్లు అగ్నిప్రమాదంలో దగ్ధమైంది. ఈ ఘటనలో ఆయన తన కూతురు పెళ్లి కోసం బీరువాలో దాచుకున్న 2 లక్షల రూపాయల నగదు మంటల్లో కాలిపోయాయి. అయితే ఈ విషయం తెలుసుకున్న దర్శకుడు శేఖర్ కమ్ముల చలించిపోయారు. వెంటనే స్పందించి, లక్ష్మయ్య కుటుంబానికి అండగా నిలిచారు. నేరుగా రైతు బ్యాంక్ ఖాతాకు రూ. 2 లక్షల ఆర్థిక సహాయాన్ని పంపించారు. అంతేకాకుండా, లక్ష్మయ్య కుటుంబంతో స్వయంగా మాట్లాడి, అవసరమైతే మరింత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. ముందుగా కూతురి పెళ్లిని మంచిగా, సంతోషంగా జరిపించాలని కోరారు.
🚨కూతురు పెళ్లి కోసం దాచుకున్న రెండు లక్షల రూపాయలు కాలిపోయాయని తెలియగానే,
నా కళ్లలో నీళ్లు తిరిగాయి అందుకే 2 లక్షలు పంపించాను …!– #SekharKammula | #Kuberaa pic.twitter.com/0pNLtXRq7X
— Bharat Media (@bharatmediahub) June 18, 2025
Read More