హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): వైద్య కళాశాలల్లో సిబ్బంది కొరతపై ఇటీవల ఎన్ఎంసీ 26 మెడికల్ కాలేజీలకు (Medical Colleges) నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో సర్కారు దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వైద్య కళాశాలల్లో 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆమోదం తెలిపింది.
34 మెడికల్ కాలేజీల్లో 1323 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు అవసరమని డీఎంఈ ప్రతిపాదించగా తొలి విడతగా 612 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆమోదం తెలిపినట్టు తెలిసింది. ప్రొఫెసర్లుగా కొనసాగుతున్న 56 మందికి అదనపు డీఎంఈ గా బాధ్యతలు ఇవ్వనున్నట్టు సమాచారం. ఇక ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖలో డిప్యూటేషన్లను రద్దు చేసిన విషయం తెలిసిందే.