Sharwanand | బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టిన యాక్టర్లలో ఒకరు శర్వానంద్. ఈ టాలెంటెడ్ యాక్టర్ నటిస్తోన్న చిత్రాల్లో ఒకటి నారి నారి నడుమ మురారి. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ మూవీ పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. మేకర్స్ ఫైనల్‌గా ఈ మూవీ సంక్రాంతికి వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. రిలీజ్ డేట్ ప్రకటించాల్సి ఉంది. కాగా నెట్టింట ఇప్పుడొక ఆసక్తికర చర్చ నడుస్తోంది.
సంక్రాంతి సీజన్ అంటే చాలా సినిమాలు పోటీలో ఉంటాయని తెలిసిందే. ఎప్పటిలాగే ఈ సారి కూడా శర్వానంద్ మరోసారి సంక్రాంతి బరిలో తన లక్‌ను పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. శర్వానంద్ నటించిన శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలు సంక్రాంతికి విడుదలై బాక్సాఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. అదే లైన్లో నారి నారి నడుమ మురారి కూడా విడుదలై హాట్రిక్ సక్సెస్ అందుకుంటుందా..? అనేది ఆసక్తికరంగా మారింది. చాలా కాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు శర్వానంద్. మరి ఎప్పటిలాగే ఈ సంక్రాంతి శర్వానంద్‌కు హిట్ ఇస్తుందా..? అనేది చూడాలి.
సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి ఇరువురు భామల కౌగిలిలో స్వామి , ఇరుకున పడి నీవు నలిగితివా అంటూ షేర్ చేసిన లుక్ నయా ట్రెండీ టచ్‌తో నెట్టింట హైప్ క్రియేట్ చేస్తుంది.
విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ మరోవైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో బైకర్‌లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది.
Shankar | ‘వేల్పారి’తో మరో విజువల్ వండర్ … 1000 కోట్ల ప్రాజెక్ట్‌పై కోలీవుడ్‌లో భారీ చర్చ
Bigg Boss 9 Telugu | 13వ వారం టికెట్ టూ ఫినాలే హీట్.. రీతూ, సంజనాల డ్రామాలు చూసి షాక్
Aryan Khan | మరోసారి చిక్కుల్లో ఆర్యన్ ఖాన్.. కేసు నమోదు