Nari Nari Naduma Murari | టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి Sharwa 37. సామజవరగమన ఫేం రామ్ అబ్బరాజు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి బాలకృష్ణ ఆల్ టైమ్ సూపర్ హిట్ సినిమా నారీ నారీ నడుమ మురారి (Nari Nari Naduma Murari) టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ చేతుల మీదుగా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు.
ఇద్దరు భామలు అరుస్తుంటే.. శర్వానంద్ మధ్యలో నలిగిపోతూ చెవులు మూసుకోవడం ఫస్ట్ లుక్‌లో చూడొచ్చు. ఈ చిత్రంలో భీమ్లానాయక్ ఫేం సంయుక్తా మీనన్, ఏజెంట్ ఫేం సాక్షి వైద్య ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తున్నారు. ఇప్పటికే సంయుక్తా మీనన్ దియా పాత్రలో నటిస్తుండగా..ఈ భామ సంప్రదాయ నృత్య భంగిమలో ఉన్న స్టిల్ ఒకటి ఇప్పటికే నెట్టింట వైరల్ అవుతోంది. ఇరువురు భామల కౌగిలిలో స్వామి , ఇరుకున పడి నీవు నలిగితివా అంటూ షేర్ చేసిన లుక్ నెట్టింట హైప్ క్రియేట్ చేస్తుంది.
ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్నారు. శర్వానంద్ మరోవైపు అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో Sharwa 36లో కూడా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. అంటూ లాంచ్ చేసిన ప్రీ లుక్ సినిమాపై అంచనాలు పెంచుతోంది.
ఇరువురు భామల కౌగిలిలో స్వామి ,
ఇరుకున పడి నీవు నలిగితివా 😉Here’s the festive treat you’ve been waiting for,
Presenting #Sharwa37 Title & First look – #𝐍𝐚𝐫𝐢𝐍𝐚𝐫𝐢𝐍𝐚𝐝𝐮𝐦𝐚𝐌𝐮𝐫𝐚𝐫𝐢 🎭❤️🔥Festive fun begins now, while the full laughter riot comes your way soon! 🔥❤️… pic.twitter.com/B3IT08Lt6v
— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2025
1990 to 2025 : The title remains, but the story gets a fresh spin 💫🔁
Thank you Global Lion #Balakrishna garu & Global Star @AlwaysRamCharan garu for launching #Sharwa37 Title & First look #𝐍𝐚𝐫𝐢𝐍𝐚𝐫𝐢𝐍𝐚𝐝𝐮𝐦𝐚𝐌𝐮𝐫𝐚𝐫𝐢 ❤️🔥
This is a momentous occasion for the entire… pic.twitter.com/vltkMIYd77
— BA Raju’s Team (@baraju_SuperHit) January 14, 2025
Dhanush | బ్లాక్ బస్టర్ కాంబో రెడీ.. వెట్రిమారన్, ధనుష్ ఐదో సినిమా ఇదే అయి ఉంటుందా..?
Daaku Maharaaj | వన్ అండ్ ఓన్లీ టాలీవుడ్ హీరోగా బాలకృష్ణ అరుదైన ఫీట్.. ఇంతకీ ఏంటో తెలుసా..?