Biker | అభిలాష్ రెడ్డి దర్శకత్వంలో టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ (Sharwanand) నటిస్తున్న చిత్రం బైకర్ (Biker). Sharwa 36 ప్రాజెక్టుగా వహిస్తున్న ఈ చిత్రంలో మాళవికా నాయర్ హీరోయిన్గా నటిస్తోంది. మీరు బైకర్ స్పీడ్ ఎలా ఉందో చూశారు. ఇక ఇప్పుడు ప్రెప్పీ మెలోడీ టైం వచ్చేసిందంటూ.. ఫస్ట్ సింగిల్ PrettyBaby ప్రోమో అప్డేట్ లుక్ విడుదల చేశారు.
హెల్మెట్ పెట్టుకున్న హీరోయిన్‌తో రొమాంటిక్ మూడ్‌లో ఉన్న శర్వానంద్ స్టిల్ సాంగ్‌పై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ పాట ప్రోమోను నవంబర్ 11న లాంచ్ చేయనున్నట్టు ప్రకటించారు. గిబ్రాన్ మ్యాజికల్ ఆల్బమ్‌ను రెడీ చేస్తున్నట్టు తాజా లుక్ చెప్పకనే చెబుతోంది. ఇప్పటికే విడుదల చేసిన గ్లింప్స్.. ఇక్కడ ప్రతీ బైకర్‌కు ఓ కథ ఉంటుంది. సమయంతో పోరాడే కథ.. చావుకు ఎదురెళ్లే కథ.. అంటూ సాగే వాయిస్‌తో ఓవర్‌తో మొదలైన గ్లింప్స్ బైక్ రేసుతో సాగుతుంది. ఏం జరిగినా పట్టువదలని మొండోళ్ల కథ అంటూ బైక్ రేసింగ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో సినిమా ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చేస్తుంది.
మీ హెల్మెట్లను పట్టుకోండి.. రైడ్ వైల్డ్‌గా ఉండబోతుంది.. గూస్బంప్స్ తెప్పించే అడ్వెంచరస్ రైడ్‌కు సిద్దంగా ఉండండి.. అంటూ శర్వానంద్ టీం ఇప్పటికే బైకర్ సినిమాపై అంచనాలు భారీగా పెంచేస్తుంది. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. బైకర్‌లో డాక్టర్ రాజశేఖర్ శర్వానంద్ తండ్రి పాత్రలో కనిపించనుండగా… బ్రహ్మాజి, అతుల్ కులకర్ణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి గిబ్రాన్ సంగీతం అందిస్తున్నాడు.
You’ve seen the speed of #Biker, now it’s time for a peppy melody ❤🔥#Biker First Single #PrettyBaby promo out on November 11th ❤️
A @ghibranvaibodha musical ✨
GRAND RELEASE WORLDWIDE ON DECEMBER 6th 💥#BIKERMovie #GoAllTheWay 🏁 #BikerOnDec06th
Charming Star… pic.twitter.com/IZHbm3LDg2
— BA Raju’s Team (@baraju_SuperHit) November 10, 2025
Sigma | విజయ్ తనయుడు డెబ్యూ మూవీ.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ పోస్టర్
Govinda | గోవిందా భార్య సంచలన వ్యాఖ్యలు .. ఇంకో జన్మ ఉంటే గోవిందా నా భర్తగా వద్దు ..
Suma | పాడ్‌కాస్ట్‌లో విడాకులపై క్లారిటీ ఇచ్చిన సుమ.. కలిసి కనిపించిన విడిపోలేదా అనే వారు