Suriya | భారత చలన చిత్రపరిశ్రమలో లీడింగ్ పొజిషన్లో ఉన్న స్టార్ సెలబ్రిటీల్లో టాప్‌లో ఉంటారు చియాన్ విక్రమ్ (vikram), సూర్య (Suriya). ఇక దశాబ్దాల కిందే భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన అతి కొద్దిమంది దర్శకదిగ్గజాల్లో ముందువరుసలో ఉంటాడు శంకర్ (Shankar). ఈ ముగ్గురి కాంబోలో సినిమా వస్తుందంటే ఎలా ఉంటుంది. అభిమానులు, మూవీ లవర్స్‌కు పండగే అని చెప్పాలి.
ఈ క్రేజీ త్రయం విజువల్ ట్రీట్‌లా ఉండబోయే సినిమా చేయబోతున్నారన్న వార్త ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది. వెల్పరి నవల ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు శంకర్ రెడీ అవుతున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. తాజా టాక్ ప్రకారం ఈ సినిమా మూడు పార్టులుగా ఉండబోతుందట. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్టుకు సంబంధించిన చర్చలు కొనసాగుతున్నాయని, అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే వీరి కలయికలో సినిమా రావడం పక్కా అయిపోయినట్టేనని తెలుస్తోంది.
ఒకవేళ ఇదే జరిగితే సిల్వర్ స్క్రీన్‌పై మాత్రం విజువల్ వండర్ కానుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా గురించి సూర్య, విక్రమ్, శంకర్ ఏదైనా హింట్ కానీ, అప్డేట్ కానీ ఇస్తారేమో చూడాలి. శంకర్ ప్రస్తుతం ఇండియన్ 3 సినిమాతోపాటు గేమ్ ఛేంజర్ సినిమాలతో బిజీగా ఉన్నాడని తెలిసిందే. సూర్య ఖాతాలో కంగువ, సూర్య 43, సూర్య 44 ఉన్నాయి. విక్రమ్ ఇటీవలే తంగలాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు.
As per Valaipechu,
– Dir Shankar is in Talks with #Suriya & #ChiyaanVikram for combining them together #Velpari movie 🌟🔥
– Movie will be taken in 3 parts🤝 pic.twitter.com/ihjj3iGoib— AmuthaBharathi (@CinemaWithAB) September 25, 2024
Prakash Raj | చేయని తప్పుకి సారీ.. హాట్ టాపిక్‌గా ప్రకాశ్ రాజ్ మరో ట్వీట్
Devara Movie | ‘దేవర’ టికెట్ ధరలు.. నిర్మాతలకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు భారీ షాక్.!
Mohan Babu | మోహన్ బాబు ఇంట్లో చోరీ.. రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి