Akhanda 2 | తెలుగుతోపాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటి అఖండ 2 (Akhanda 2). బాలకృష్ణ (Balakrishna), బోయపాటి శీను (Boyapati srinu) కాంబోలో వస్తోన్న ఈ సీక్వెల్ ప్రాజెక్ట్ 2025 డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని తెలిసిందే. మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన అఖండ 2 టీజర్ నెట్టింట మిలియన్ల సంఖ్యలో వ్యూస్ రాబడుతూ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలుస్తోంది.
అఖండ ఫస్ట్ పార్ట్‌లో మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ బీజీఎం ఏ రేంజ్లో సినిమాకు హైలెట్‌గా నిలిచిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక సీక్వెల్ ప్రాజెక్ట్‌లో అంతకుమించిన స్కోర్ గూస్ బంప్స్ తెప్పించేలా ఉండబోతుందని ఇప్పటివరకు వచ్చిన రషెస్ చెబుతున్నాయి. కాగా మూవీ అండ్ మ్యూజిక్ లవర్స్‌కు థ్రిల్ అందించే అదిరిపోయే వార్త ఒకటి ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న లెజెండరీ సింగర్స్‌లో టాప్‌లో ఉంటారు శంకర్ మహదేవన్, కైలాశ్ ఖేర్. ఈ ఇద్దరు సింగర్స్ పాటలు దేశమంతా ఎక్కడో ఒకచోట మార్మోగుతుంటాయని తెలిసిందే. అఖండ 2 కోసం ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారన్న వార్త హైప్ పెంచేస్తుంది.
నవంబర్ 7న అఖండ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమోను ప్రకటించనున్నారని తెలిసిందే. నవంబర్ 9న ఫుల్ ట్రాక్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ పాటను శంకర్ మహదేవన్, కైలాశ్ ఖేర్ పాడినట్టు థమన్ ప్రకటించడంతో ఓ వైపు పాటతోపాటు మరో సినిమాపై కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ ఇద్దరి వాయిస్‌తో థియేటర్లలో స్పీకర్లు బద్దలు ఖాయమైపోయినట్టేనని అంటున్నారు సినీ జనాలు.
Harish Rai | శాండల్‌వుడ్‌లో విషాదం.. కేజీఎఫ్ నటుడు కన్నుమూత
Shilpa Shetty | రూ.60 కోట్ల మోసం కేసు.. నిధులు మళ్లించిన వ్యక్తుల్ని గుర్తించిన దర్యాప్తు బృందం