ఒకేసారి బ్యాక్ టు బ్యాక్ భారీ సినిమాలను లైన్లో పెట్టిన స్టార్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా..? అంటే వెంటనే చెప్పే పేరు శంకర్ (Shankar). ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ సినిమాలను అందించిన శంకర్ ఇప్పుడు రెండు భారీ సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే. వీటిలో ఒకటి ఆర్సీ 15గా తెరకెక్కుతున్న గేమ్ చేంజర్.. కాగా రెండోది ఇండియన్ 2 (Indian 2). ఈ రెండు సినిమాల షూటింగ్స్‌ను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు శంకర్.
రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ మూవీ లవర్స్ కు ఊపిరాడకుండా చేస్తున్నాడు. కమల్ హాసన్ (Kamal Haasan) నటిస్తోన్న ఇండియన్ 2ను లైకా ప్రొడక్షన్స్ భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తోంది. ఇటీవల విదేశీ యాక్షన్ అండ్ స్టంట్ డిజైనింగ్ టీంతో కమల్ హాసన్ జాయిన్ అయిన ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. కాగా ఇప్పుడు ఫొటో రూపంలో మరో క్రేజీ అప్డేట్ అందించాడు శంకర్. తైవాన్‌లోని అందమైన లొకేషన్లో స్క్రిప్ట్ చదువుతున్న స్టిల్‌ను శంకర్ షేర్ చేశాడు. ప్రస్తుతం తైవాన్‌లో ఇండియన్ 2 షూటింగ్ జరుగుతోంది. ఇండియన్ 2 టైటిల్‌తో ఉన్న ఎయిర్బెలూన్ను గాల్లోకి ఎగరేసిన వీడియో కూడా నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా..సిద్దార్థ్, బాబీ సింహా, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్-రెడ్ జియాంట్ మూవీస్ బ్యానర్లపై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ చిత్రానికి మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
తైవాన్ లొకేషన్లో శంకర్ టీం…
Indian2 shoot at Taiwan started with a bang.. ❤️🔥#Kamalhaasan #Indian2 pic.twitter.com/opt3QXguy1
— ꧁༒☬𝓡𝓪𝓳𝓮𝓼𝓱☬༒꧂ (@rnrrrajesh23) April 2, 2023
Read Also :
Mahesh Babu | మహేశ్‌బాబు మరో వెకేషన్.. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ సంగతేంటి..!
Nani 30 | స్పీడుమీదున్న నాని.. నాని 30 షూటింగ్‌పై తాజా అప్డేట్
Rahul Dev | అందుకే సౌత్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి : రాహుల్ దేవ్