దసరా సక్సెస్‌ను ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు న్యాచురల్ స్టార్ నాని (Nani). పక్కా మాస్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 30న విడుదలై మంచి వసూళ్లు రాబడుతోంది. కాగా ఇప్పుడు నాని కొత్త సినిమాకు సంబంధించిన అప్డేట్ బయటకు వచ్చింది. ఈ స్టార్ హీరో మరోవైపు నాని 30 (Nani 30) సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి డెబ్యూ డైరెక్టర్ శౌర్యువ్ (Shouryuv) దర్శకత్వం వహిస్తున్నాడు.
తాజా అప్డేట్ ప్రకారం ఈ మూవీ కొత్త షెడ్యూల్ రేపు గోవాలో షురూ కానుంది. లేటెస్ట్ టాక్ ప్రకారం 40 రోజులపాటు ఈ షెడ్యూల్ కొనసాగనుందట. తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతున్నట్టు ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ వీడియోతో హింట్ ఇచ్చేశాడు దర్శకుడు. నాని ఓ వైపు దసరా సినిమాతో అభిమానులను ఖుషీ చేస్తూనే.. మరోవైపు కొత్త సినిమా అప్డేట్ అందించి జోష్ నింపుతున్నాడు.
ఈ చిత్రంలోనాని కూతురి పాత్రలో బేబి కైరా ఖన్నా నటిస్తోంది. సీతారామం ఫేం మృణాళ్ ఠాకూర్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఈ చిత్రాన్ని వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల, మూర్తి కేఎస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సను జాన్ వర్గీస్ ఐఎస్సీ కెమెరామెన్ కాగా.. మలయాళం కంపోజర్, హృదయం ఫేం హెశమ్ అబ్దుల్ వహబ్ సంగీతం అందిస్తున్నాడు.
నాని 30 గ్లింప్స్ వీడియో..
Mahesh Babu | మహేశ్‌బాబు మరో వెకేషన్.. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ సంగతేంటి..!
Rahul Dev | అందుకే సౌత్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి : రాహుల్ దేవ్