సింహాద్రి, మాస్, తులసి, మున్నాతోపాటు పలు తెలుగు చిత్రాల్లో విలన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు రాహుల్ దేవ్ (Rahul Dev). ఈ టాలెంటెడ్ యాక్టర్ తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ, మరాఠీ, బెంగాలీతోపాటు పలు భారతీయ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఇటీవలే సారా అలీఖాన్, చిత్రాంగద సింగ్, విక్రాంత్ మస్సే కలిసి డిస్నీ +హాట్ స్టార్ ఫిల్మ్ (Gaslight)లో కనిపించాడు. రాహుల్ దేవ్ సౌత్ సినిమాల (South films) సక్సెస్ గురించి మీడియాతో చేసిన చిట్‌చాట్‌లో తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు.
క్రియేటివిటీని ఏ రూపంలోనైనా వ్యక్తీకరించవచ్చు. సౌత్ నుంచి వచ్చిన సినిమాలు ఆకర్షణీయమైన కథా శైలి, ఎక్కువ ప్రభావితం చేసే పాత్రలతో గొప్ప పనితీరు కనబరుస్తున్నాయి. బాలీవుడ్ తన సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడం లేదు. దక్షిణాది సినిమాలు 70స్, 80స్ కాలంనాటి సినిమాల రూట్లో పయనిస్తూ.. టాప్ యాక్షన్ సన్నివేశాలు, ఊహించని పాత్రలతో సాగుతున్నాయి. అయితే ప్రేక్షకులు కథను ఎలా అర్థం చేసుకోని.. రిసీవ్ చేసుకున్నారనేది చాలా ముఖ్యమైంది.
కమర్షియల్ సినిమాలనేవి ప్రత్యేకమైన కేటగిరీ ప్రేక్షకులకు బాగా నచ్చుతాయి. అవి అంత చెడ్డ సినిమాలేమి కాదు. ప్రస్తుత ఓటీటీ ప్రపంచంలో ఓ నటుడి ప్రతిభ చాలా సహజంగా ఉంటుందని నమ్ముతున్నట్టు చెప్పాడు రాహుల్ దేవ్. నటనకు ఎక్కువ ఆస్కారం ఉన్న ఛాలెంజింగ్ పాత్రలు చేసే అవకాశం కోసం రాహుల్ దేవ్ ఎదురుచూస్తున్నట్టు తాజా కామెంట్స్ తో అర్థమవుతుంది.
Mahesh Babu | మహేశ్‌బాబు మరో వెకేషన్.. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ సంగతేంటి..!
Nani 30 | స్పీడుమీదున్న నాని.. నాని 30 షూటింగ్‌పై తాజా అప్డేట్