Mahesh Babu | మహేశ్‌బాబు మరో వెకేషన్.. ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ సంగతేంటి..!
Mahesh Babu | మహేశ్ బాబు (Mahesh Babu)హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 షూటింగ్ పనులు ఇప్పటికే హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇటీవలే విడుదల చేసిన ఎస్ఎస్ఎంబీ 28 ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
Mahesh Babu | టాలీవుడ్ స్టార్ హీరో మహేశ్ బాబు (Mahesh Babu) వీలు దొరికినప్పుడల్లా వెకేషన్ ప్లాన్ చేసుకుంటాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 షూటింగ్ పనులు ఇప్పటికే హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజా అప్డేట్ ప్రకారం మహేశ్ బాబు ఏప్రిల్ 6 లేదా 7వ తేదీన వెకేషన్లో భాగంగా పారిస్‌కు వెళ్లనున్నాడట.
మహేశ్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పటికే పారిస్‌లో ఉండగా.. త్వరలోనే వారితో జాయిన్ కాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్. మహేశ్ బాబు 15 రోజులపాటు అక్కడే ఉండనుండగా.. మళ్లీ ఏప్రిల్ 4వ వారంలో హైదరాబాద్‌కు తిరిగి రానున్నాడట. సమ్మర్లో మహేశ్ బాబు ఔట్ డోర్ షూటింగ్‌కు అంతగా ఇష్టపడని కారణంగా.. కొత్త షెడ్యూల్‌ను ఎయిర్ కండిషన్ సెట్లో షూట్ చేసేలా త్రివిక్రమ్ టీం ప్లాన్ చేసిందని టాక్. ఈ లెక్కన మహేశ్ వెకేషన్ పూర్తయ్యాకకానీ మళ్లీ షూటింగ్లో చేరే అవకాశాలు లేవన్నమాట.
ఇటీవలే విడుదల చేసిన ఎస్ఎస్ఎంబీ 28 ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ చిత్రాన్ని జనవరి 13న గ్రాండ్‌గా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించి అభిమానుల్లో జోష్ నింపింది త్రివిక్రమ్ టీం. ఎస్ఎస్ఎంబీ 28లో పూజాహెగ్డే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. శ్రీలీల సెకండ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. ఎస్ఎస్ఎంబీ 28కి ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడని వార్తలు వస్తుండగా.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.
Read Also :
Rahul Dev | అందుకే సౌత్ సినిమాలు సక్సెస్ అవుతున్నాయి : రాహుల్ దేవ్
Nani 30 | స్పీడుమీదున్న నాని.. నాని 30 షూటింగ్‌పై తాజా అప్డేట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

