బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor) నటించిన చిత్రాల్లో ఒకటి షంషేరా (Shamshera). జులై 22న విడుదలైంది. అయితే విడుదలకు ముందు క్రియేట్ అయిన హైప్ రిలీజ్ తర్వాత మాత్రం పనిచేయలేకపోయింది. బాక్సాపీస్ వద్ద యావరేజ్ కలెక్షన్లతో సరిపెట్టుకుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కరణ్ మల్హోత్రా (Karan Malhotra) ఓ ఇంట్రెస్టింగ్ నోట్ పోస్ట్ చేశాడు.
షంషేరా చిత్రం పట్ల చాలా గర్వంగా, గొప్పగా ఫీలవుతున్నా. సినిమాకు బాక్సాపీస్ వద్ద మంచి టాక్ కానీ, బ్యాడ్ టాక్ కానీ ఏది వచ్చినా ఎదుర్కొనడానికి సిద్దంగా ఉన్నా. షంషేరా నాది అంటూ సందేశాన్ని ముగించాడు కరణ్. ఆ వెంటనే అభిమానులు కరణ్‌కు అనుకూలంగా తమ మద్దతును చూపించడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో ప్రేక్షకులు తనకు ఘనమైన కమ్‌బ్యాక్ ఇస్తారని దర్శకుడు కరణ్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి రానున్న రోజుల్లో ఎలాంటి కలెక్షన్ల ఉంటాయనేది చూడాలి మరి. మరోవైపు రణ్‌బీర్-అలియా (Alia Bhatt)తో కలిసినటించిన బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Shamshera is mine! #Shamshera #Shamsheraismine pic.twitter.com/MZyCfaeHFB
— Karan Malhotra (@karanmalhotra21) July 27, 2022
Read Also : DJ Tillu 2 | డీజేటిల్లు 2 డైరెక్టర్‌గా రామ్..క్రేజీ న్యూస్‌లో నిజమెంత..?
Read Also : Atal Bihari Vajpayee Look | ‘ఎమర్జెన్సీ’ నుంచి అటల్ బిహారీ వాజ్‌పేయి లుక్
Read Also : Bimbisara Release Trailer | బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరింది..’బింబిసార’ రిలీజ్ ట్రైలర్