Shivakarthik | ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా యాక్టర్‌గా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించాలంటే చాలా కష్టాలు పడాలి. ఎన్ని కష్టాలు పడ్డా ఒక్కోసారి అవకాశం దొరుకుతుందనే భరోసా కూడా ఉండదు. సినీ ఇండస్ట్రీలో అవకాశాలు రావడం, వచ్చిన అవకాశాన్ని నిలబెట్టుకోవడం అంత సులభమైన విషయమేం కాదు. ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్తూ వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటూ నటుడిగా తనను తాను నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్న వ్యక్తుల్లో ఒకడు శివ కార్తీక్.
ఈ నటుడు కెరీర్లో చాలా సినిమాలు చేసినప్పటికీ ఆదిసాయికుమార్‌తో కలిసి నంటించిన శంబాల తనకు మంచి గుర్తింపునిచ్చిందని అంటున్నాడు. జోష్ మూవీతో కెరీర్ షురూ చేసిన ఈ యాక్టర్ భీమిలి కబడ్డీ జట్టు, పిల్ల జమీందార్ సినిమాల్లో నటించాడు. అంతేకాదు లీడ్ యాక్టర్‌గా లజ్జా సినిమా చేసినా అంతగా వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత ఆర్జీవీ కాంపౌండ్ నుంచి వచ్చిన భైరవ గీత సినిమాలో నటించాడు. ఈ సినిమా చూసి బోయపాటి శీను తనకు అఖండలో అవకాశం ఇచ్చారన్నాడు శివకార్తీక్.
ఉగ్రం తర్వాత తన పర్ఫార్మెన్స్ మాట్లాడుకోవడం మొదలుపెట్టారని.. ఈ క్రమంలో తండేల్‌లో మంచి పాత్ర వచ్చిందని అన్నాడు శివకార్తీక్. విభిన్న పాత్రలు చేయాలనుకుంటున్న సమయంలో మనీశ్ అనే కో డైరెక్టర్ సాయంతో యుగంధర్ మునిని కలిశాను. అలా శంబాల సినిమాలో తనకు మంచి పాత్ర దొరికిందని చెప్పుకొచ్చాడు.
MK Stalin | హిందీకి తమిళనాడులో స్థానం లేదు.. భవిష్యత్తులోనూ ఉండబోదు : సీఎం స్టాలిన్
Nayanthara | మమ్ముట్టి-మోహన్‌లాల్ ‘పేట్రియాట్’ నుంచి నయనతార ఫస్ట్ లుక్ రిలీజ్