Nayanthara First Look Release | మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, మోహన్‌లాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న భారీ బహుభాషా చిత్రం ‘పేట్రియాట్'(Patriotic). ప్రముఖ దర్శకుడు మహేష్ నారాయణన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో మోహన్‌లాల్ ‘కల్నల్ రహీమ్ నాయక్’గా, మమ్ముట్టి ‘డాక్టర్ డేనియల్ జేమ్స్’గా నటిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఒక అక్రమ ఆపరేషన్‌ను ఎలా అడ్డుకున్నారనేది కథాంశం. ఈ సినిమాలో ఫహద్ ఫాసిల్, కుంచాకో బోబన్, రేవతి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న నయనతార ఫస్ట్ లుక్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ పోస్టర్‌పై ‘విభేదించడం కూడా దేశభక్తే’ (Dissent is patriotic) అనే క్యాప్షన్ ఉండటం ఆసక్తికరంగా మారింది. మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి దిగ్గజాలతో పాటు నయనతార కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
PATRIOT !!
A Mahesh Narayanan Film 🎥 pic.twitter.com/6gtN54kBU3
— Nayanthara✨ (@NayantharaU) January 25, 2026