యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్గా రాబోతున్న చిత్రం ‘శాకిని ఢాకిని’ (Shakini Dhakini). సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నాడు. టాలీవుడ్ భామలు నివేదా థామస్ (Nivetha Thomas), రెజీనా కసాండ్రా (Regina Cassandra) లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. చాలా రోజుల తర్వాత ఈ సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్ బయటకు వచ్చింది. మొదట ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావించినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు.
సెప్టెంబర్ 16న గ్రాండ్‌గా థియేటర్లలో సందడి చేయనుంది శాకిని డాకిని. రెట్టింపు వినోదం..రెట్టింపు యాక్షన్.. శాలినీ, దామిని వచ్చేస్తున్నారు..అంటూ ట్వీట్ చేసింది వన్ ఆఫ్ ది ప్రొడక్షన్స్ హౌస్ సురేశ్ ప్రొడక్షన్స్ . ఈ చిత్రాన్ని సురేశ్ ప్రొడక్షన్స్, గురు ఫిలిమ్స్, క్రాస్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మికీ ఎంసీ క్లియరీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
కొరియన్ చిత్రం ‘మిడ్ నైట్ రన్నర్స్’కి రీమేక్‌గా యాక్షన్ థ్రిల్లర్ గా వస్తోన్న ఈ చిత్రంలోరెజీనా, నివేదా అద్బుతమైన స్టంట్స్ తో అదరగొట్టబోతున్నారని ఇన్సైడ్ టాక్. ఈ సినిమా కోసం రెజీనా జపనీస్ మార్షల్ ఆర్ట్స్ జియు-జిట్సు లో ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకోవడం విశేషం.
Double the fun ✨
Double the action ⚡
Shalini and Damini are here to slay! #SaakiniDaakini #SDonSep16th @sudheerkvarma @SunithaTati @ReginaCassandra @i_nivethathomas @sbdaggubati @gurufilms1 @MikeyMcCleary1 @rip_apart @kross_pictures @vijaydonkada pic.twitter.com/D3SKuiVjwY— Suresh Productions (@SureshProdns) August 16, 2022
Read Also :Godfather | ‘గాడ్ ఫాదర్’ కొత్త అప్డేట్..బర్త్ డే ట్రీట్‌కు చిరు రెడీ..!
Read Also : Dulquer Salmaan | దుల్కర్ సల్మాన్ ఫేవరేట్ తెలుగు హీరో ఇతడేనట..!
Read Also :Vassishta | అబ్బాయితో సక్సెస్..త్వరలోనే బాబాయితో కూడా..!