దేశీయ సినీ రంగంలో సౌత్ సినిమాల ప్రభావం చూస్తూనే ఉన్నాం. ఓ స్ట్రెయిట్ బాలీవుడ్ చిత్రాన్ని ప్రభావితం చేసేంత ఎదిగాయి దక్షిణాది సినిమాలు. ఈ నెల 14న కన్నడ చిత్రం కేజీఎఫ్ 2 (KGF: Chapter 2) చిత్రంతో పాటు విడుదల కావాల్సిన షాహిద్ కపూర్ (Shahid kapoor) జెర్సీ (Jersey) సినిమా ఏప్రిల్ 22 తేదీకి వాయిదా పడింది. ఈ రెండు వేటికవి భిన్నమైన చిత్రాలు అయినా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద దక్షిణాది చిత్రాల జోరు చూసే జెర్సీ వాయిదా వేశారా..? అనే సందేహాలు కలిగాయి. ఈ ప్రశ్నలకు జెర్సీ హీరో షాహిద్ కపూర్ వివరణ ఇచ్చారు.
తాజాగా షాహిద్ కపూర్ మాట్లాడుతూ…మాది స్ట్రైట్ సినిమా, అది (కేజీఎఫ్ 2) హిందీ డబ్ వెర్షన్. మాది ఎమోషనల్ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా. కేజీఎఫ్ 2 యాక్షన్ ఫిల్మ్. ఆ చిత్ర మొదటి భాగానికి చాలా మంది అభిమానులు ఉన్నారు. ఒకే రోజు రెండు పెద్ద చిత్రాలు విడుదల చేసుకోవచ్చు. ప్రేక్షకులకు ఆ రెండు సినిమాల్లో నచ్చినది చూసే వీలుంటుంది. జెర్సీ విషయంలో జరిగింది వేరు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా ఏప్రిల్ 22న విడుదల కావాల్సి ఉంది. కానీ ఆగస్టుకు వాయిదా వేశారు. అది గొప్ప డేట్ అని భావించాం. అందుకే మా చిత్రాన్ని ఆ తేదీకి మార్చుకున్నాం. దీని గురించి లోతుగా ఆలోచించాల్సింది ఏమీ లేదు..అని అన్నాడు.
Read Also : Prashanth Neel | మందు తాగడం గురించి ఓపెన్ అయిన కేజీఎఫ్ డైరెక్టర్..!
నాని (Nani) హీరోగా నటించిన తెలుగు హిట్ ఫిల్మ్ జెర్సీ అదే పేరుతో బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది. ఈ చిత్రాన్ని తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) తెరకెక్కించారు. ఈ చిత్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. పాండమిక్ వల్ల వాయిదాలు పడుతూ వచ్చిన జెర్సీ…ఇప్పుటికి ఫైనల్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
Read Also : Jr NTR Deeksha | రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..దీక్షకు ప్లాన్..!