టాలీవుడ్ (Tollywood) సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Prabhas) తో వన్ నేనొక్కడినే సినిమాలో నటించి..తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది బాలీవుడ్ భామ కృతిసనన్ (Kriti Sanon). ఆ తర్వాత నాగచైతన్యతో దోచెయ్ సినిమాలో కనిపించింది. అనంతరం హిందీ సినిమాలపైనే పూర్తిగా ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం ఆదిపురుష్ లాంటి భారీ ప్రాజెక్టుతోపాటు పలు చిత్రాలతో బిజీగా ఉంది కృతిసనన్. సినిమాలతో సంబంధం లేకుండా నెట్టింట్లో కూడా సూపర్ యాక్టివ్‌గా ఉంటూ తన అప్డేట్స్ షేర్ చేస్తుంటుంది కృతిసనన్.
ఫిట్‌గా, హెల్తీ లుక్‌లో కనిపించే బాలీవుడ్ భామల్లో కృతిసనన్ ఒకరు. ఇదే విషయాన్ని మరోసారి ప్రూవ్ చేస్తోంది. తాజాగా ఇన్ స్టా రీల్లో వర్కవుట్ వీడియో (Kriti Sanon Gym)షేర్ చేసింది. ఈ భామ జిమ్‌లో చెమటోడుస్తోంది. డంబెల్ బెంచ్ ప్రెస్, కేటిల్ బెల్స్ వర్కవుట్‌ను చాలా సులభంగా చేస్తూ..ఫిట్ నెస్ లవర్స్ లో జోష్ నింపుతోంది. ఫిట్‌గా మారేందుకు కృతిసనన్ చూపిస్తున్న డెడికేషన్‌ను అభిమానులు, ఫాలోవర్లు ప్రశంసిస్తున్నారు.
కృతిసనన్ ప్రస్తుతం షెహ్జాదా, భేడియా, గనపథ్ చిత్రాల్లో నటిస్తోంది. వీటిలో భేడియా షూటింగ్ పూర్తి చేసుకుంది. కొంత మన్ డే మోటివేషన్ కోసం ఇది మరీ అంత ఆలస్యమేమి కాదు..అంటూ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది. కృతిసనన్ వర్కవుట్ వీడియో ఇపుడు నెట్టింట్లో హల్చల్ చేస్తోంది.