Jr NTR Deeksha | రాంచరణ్ బాటలో ఎన్టీఆర్..దీక్షకు ప్లాన్..!
సాధారణంగా సినీ సెలబ్రిటీలు ప్రొఫెషనల్ అంశాలను పక్కన పెట్టి వీలు చేసుకొని ఇతర వ్యాపకాలపై అప్పుడపుడు దృష్టి పెడుతుంటారు. సెలబ్రిటీలు ఎంచుకునే మార్గాల్లో ఆధ్యాత్మిక భావన కూడా ఒకటి.
సాధారణంగా సినీ సెలబ్రిటీలు వృత్తిపరమైన కమిట్ మెంట్స్ తో బిజీబిజీగా ఉంటుంటారు. అయితే ప్రొఫెషనల్ అంశాలను పక్కన పెట్టి వీలు చేసుకొని ఇతర వ్యాపకాలపై అప్పుడపుడు దృష్టి పెడుతుంటారు. సెలబ్రిటీలు ఎంచుకునే మార్గాల్లో ఆధ్యాత్మిక భావన కూడా ఒకటి. ఇటీవలే ఆర్ఆర్ఆర్ తో సూపర్ సక్సెస్ అందుకున్న స్టార్ హీరో రాంచరణ్ (Ram Charan)అయ్యప్ప స్వామి దీక్ష (Ayyappa Swamy Deeksha) తీసుకున్నాడు. డైరెక్టర్ శంకర్‌తో చేస్తున్న మెగా పాన్ ఇండియా ప్రాజెక్టు షూటింగ్ లో అయ్యప్ప మాలతోనే పాల్గొంటున్నాడు.
తాజాగా మరో స్టార్ హీరో కూడా దీక్ష చేపట్టబోతున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరనే కదా మీ డౌటు..ట్రిపుర్ హీరో ఎన్టీఆర్ (Jr NTR). తాజా రిపోర్ట్స్ ప్రకారం తారక్ ఆంజనేయ స్వామి దీక్ష (Anjaneya Swamy Deeksha) చేపట్టబోతున్నాడని తెలుస్తోంది. 21 రోజులపాటు దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నాడట తారక్. కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్న ఎన్టీఆర్ 30 ప్రాజెక్టు ఇంకా షురూ కాలేదు.

Read Also : Kriti Sanon Gym | జిమ్‌లో చెమటోడుస్తున్న మహేశ్ హీరోయిన్..వీడియో హల్చల్
ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లేలోపే దీక్షతోపాటు ఇతర కార్యక్రమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడట ఎన్టీఆర్. కొరటాల శివ సినిమా కోసం తారక్ న్యూ లుక్‌లో స్ట్రాంగ్‌గా కనిపించేందుకు కొంత బరువు తగ్గే ప్లాన్ కూడా రెడీ చేసుకున్నాడని టాక్. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా, ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో మరో సినిమాను ట్రాక్ పైకి తీసుకెళ్లనున్నాడు ఎన్టీఆర్.
Read Also : Prashanth Neel | మందు తాగడం గురించి ఓపెన్ అయిన కేజీఎఫ్ డైరెక్టర్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

