Shah Rukh Khan | తమ అభిమాన నటుడి పుట్టినరోజు వచ్చిందంటే చాలు అభిమానులకు పండగనే చెప్పాలి. వారం ముందు నుంచే జన్మదిన వేడుకలను షురూ చేస్తారు. పలు సేవా కార్యక్రమాలను మొదలుపెడతారు. ఇక పుట్టినరోజు నాడు బాణాసంచా కాలుస్తూ సందడి చేస్తారు. కేక్ కట్ చేసి.. అందరికీ పంచిపెడుతూ తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. తాజాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తన 57వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఈ బీటౌన్ స్టార్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేందుకు షారుక్ నివాసం వద్ద అభిమానులు క్యూ కట్టారు.
మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత బాద్ షా కోసం అభిమానులు భారీ సంఖ్యలో ఆయన నివాసం మన్నత్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఇంటి బాల్కని వద్దకు వచ్చిన షారుక్ తన అభిమానులకు అభివాదం చేస్తూ సందడి చేశారు. వారితో సెల్ఫీలు దిగారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Happiest birthday Bollywood superstar SRK pic.twitter.com/OtrBwsMNuP
— Biswajit Sahoo (@Biswaji31751266) November 2, 2022