బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) మూడేళ్లకుపైగా సుదీర్ఘ విరామం తర్వాత నటిస్తోన్న తాజా ప్రాజెక్ట్ పఠాన్ (Pathaan). యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రాన్ని సిద్దార్థ్ ఆనంద్ డైరెక్ట్ చేస్తున్నాడు. దీపికా పదుకొనే ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా… బాలీవుడ్ యాక్టర్ జాన్ అబ్రహాం కీలక పాత్ర పోషిస్తున్నాడు. 2023 జనవరి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో సందడి చేయబోతుంది పఠాన్.
ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే ప్రమోషన్స్ పై ఫోకస్ పెట్టాడు బాద్ షా. షారుఖ్ ఖాన్ ఏకంగా సూపర్ క్రేజ్ ఉన్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పఠాన్ ప్రమోషన్స్ చేయబోతున్నాడు. ఈ విషయాన్ని ఓ వీడియో ద్వారా తెలియజేశాడు. ఖతార్‌లో డిసెంబర్ 18న జరుగబోయే ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో పఠాన్ చిత్రాన్ని ప్రమోట్ చేయబోతున్నట్టు తెలియజేశాడు షారుఖ్ . ఈ వీడియో ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
పఠాన్‌లో వచ్చే స్టన్నింగ్ యాక్షన్ సన్నివేశాలను స్పెయిన్, యూఏఈ, టర్కీ, రష్యా, సైబీరియా, ఇటలీ, ఫ్రాన్స్, ఇండియా, అప్ఘనిస్థాన్‌లో (8 దేశాలు) షూట్ చేసినట్టు ఇప్పటికే అప్డేట్ ఇచ్చి మూవీ లవర్స్ లో సినిమాపై అంచనాలను మరింత పెంచేస్తున్నారు మేకర్స్. పఠాన్ హిందీ, తమిళం, తెలుగులో విడుదల అవుతుంది.
పఠాన్ నుంచి ఇప్పటికే విడుదలైన దీపికా పదుకొనే, షారుఖ్ ఖాన్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్లు క్యూరియాసిటీ పెంచుతున్నాయి. యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో పఠాన్ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. పఠాన్ దీపికా-షారుఖ్ ఖాన్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా.
షారుఖ్‌ఖాన్ ప్రమోషన్స్అప్డేట్ వీడియో..
Field par Messi aur Mbappe… studio mein @WayneRooney aur main… #Pathaan!
18 Dec ki shaam hogi shaandaar!
Dekhiye #FIFAWorldCup Final mere saath, LIVE on @JioCinema & @Sports18 pic.twitter.com/KP8dANSOra— Shah Rukh Khan (@iamsrk) December 15, 2022
Read Also : Read Also :Kalyanam Kamaneeyam | కళ్యాణం కమనీయం నుంచి ఓ మనసా లిరికల్ వీడియో సాంగ్
Read Also : Pawan Kalyan | విజయ్ కోసం వస్తున్న పవన్.. క్రేజీ టాక్‌లో నిజమెంత..?