ఆదివారం 05 జూలై 2020
Cinema - Apr 27, 2020 , 23:30:45

పారిశుద్ధ్య కార్మికుల కోసం

పారిశుద్ధ్య కార్మికుల కోసం

పారిశుద్ధ్య కార్మికులు తన దృష్టిలో దేవుళ్లతో సమానమని అన్నారు దర్శకుడు శేఖర్‌కమ్ముల. విపత్కర పరిస్థితుల్లో ఎండలను లెక్కచేయకుండా కార్మికులు తమ విధులను నిర్వర్తిస్తున్నారని ఆయన చెప్పారు. నార్త్‌జోన్‌ పరిధిలో పనిచేసే వెయ్యి మంది పారిశుద్ధ్య సిబ్బందికి నెలరోజుల పాటు బాదంపాలు, మజ్జిగ ఉచితంగా అందించేందుకు ముందుకొచ్చారు  దర్శకుడు శేఖర్‌కమ్ముల. ఈ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ జీహెచ్‌ఎంసీ అధికారులతో కలిసి ప్రారంభించారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ మాట్లాడుతూ ‘పారిశుద్ధ్య కార్మికులు సమాజానికి చేస్తున్న సేవలు అమోఘం. వారి క్షేమాన్ని కాంక్షిస్తూ  దర్శకుడు శేఖర్‌ కమ్ముల తీసుకున్న నిర్ణయాన్ని అభినందిస్తున్నాను’ అని తెలిపారు.  శేఖర్‌కమ్ముల మాట్లాడుతూ ‘పారిశుద్ధ్య కార్మికులకు కృతజ్ఞత చెప్పాలనే ఆలోచనతో వెయ్యి మందికి నెల  రోజుల పాటు మా అమిగోస్‌ సంస్థ ద్వారా బాదంపాలు, మజ్జిగ అందించాలని నిర్ణయించుకున్నా.  వాటిని మేము పంచడం కంటే జీహెచ్‌ఎంసీ సిబ్బంది ద్వారానే కార్మికులకు అందించగలిగితే వారికి మరింత గౌరవం ఇచ్చిన వారమవుతాం. అందుకే  ఈ పంపిణినీ జీహెచ్‌ఎంసీ సిబ్బందికే అప్పగించాం. మనిషికి మనిషి తోడుండాల్సిన సమయమిది’ అని తెలిపారు. 


logo