న్యూయార్క్ : టెక్ ప్రపంచంలో ఏఐ టూల్స్‌పై హాట్ డిబేట్ సాగుతుండగా దీని పర్యవసానాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఏఐ టూల్స్ దుర్వినియోగంతో లేటెస్ట్ టెక్నాలజీపై నియంత్రణ ఉండాలని టెక్ దిగ్గజ సీఈవోల నుంచి ఐటీ నిపుణుల వరకూ ప్రభుత్వాలను కోరుతున్నారు. ఇక లేటెస్ట్గా ఓ ప్రకటన కోసం తన వాయిస్ క్లోనింగ్‌కు పాల్పడినందుకు ఓ ఏఐ యాప్‌పై మార్వెల్ స్టార్ స్కార్లెట్ జొహాన్సన్ (Scarlett Johansson) న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సంసిద్ధమైంది.
ఏఐ ఇమేజ్ జనరేటింగ్ యాప్ లిసా ఏఐ ప్రకటనలో మార్వెల్ నటి 22 సెకండ్ల కమర్షియల్‌లో కనిపించింది. ఈ యాడ్‌లో స్కార్లెట్ ఏఐ జనరేటెడ్ ఫొటోస్‌తో మెరవగా, ఆమెను అనుకరించేలా ఏఐ జనరేటెడ్ వాయిస్ ఇమిటేటింగ్తో మాయాజాలం చేశారు. ఏఐ యాప్‌ను ఆమె వాయిస్ ప్రమోట్ చేస్తూ ఇది కేవలం అవతార్స్కే పరిమితం కాదు..టెక్ట్స్, ఏఐ వీడియోస్‌తో మీరు కూడా ఇమేజ్‌లను క్రియేట్ చేయవచ్చని స్కార్లెట్ ఏఐ వాయిస్ వినిపిస్తుంది.
అయితే కమర్షియల్ సాగుతున్నంతసేపు ఇమేజ్‌లను లిసా ఏఐ ప్రొడ్యూస్ చేసింది..ఈ వ్యక్తికి (స్కార్లెట్) ఎలాంటి సంబంధం లేదని డిస్‌క్లెయిమర్ రన్ చేశారు. ఈ ఉదంతంపై స్కార్లెట్ ఓ రేంజ్లో విరుచుకుపడింది. ఈ వ్యవహారాన్ని తాము తేలికగా తీసుకోమని, దీనిపై న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు అవసరమైన అన్ని అవకాశాలను ఎంచుకుంటామని నటి న్యాయవాది ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
Read More :
Pinarayi Vijayan | కేరళ సీఎంకు బెదిరింపులు.. చంపేస్తానంటూ ఫోన్ చేసిన 12 ఏళ్ల బాలుడు