డీప్‌ఫేక్ వీడియోల కలకలం ఒకవైపు కొనసాగుతుండగానే వాయిస్ క్లోనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో ఈ తరహా కేసులు నమోదయ్యాయి.
ఓ ప్రకటన కోసం తన వాయిస్ క్లోనింగ్‌కు పాల్పడినందుకు ఓ ఏఐ యాప్‌పై మార్వెల్ స్టార్ స్కార్లెట్ జొహాన్సన్ (Scarlett Johansson) న్యాయపరమైన చర్యలు చేపట్టేందుకు సంసిద్ధమైంది.