Scam 2003: The Telgi Story | ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫార్మ్ సోని లీవ్(Sony Liv)లో ప్రసారం అయ్యే ” స్కామ్ 1992: ది హర్షద్ మెహతా స్టోరీ (Scam 1992) ” సిరీస్ గురించి అందరికి తెలిసే ఉంటుంది. స్టాక్ బ్రోకర్ హర్షద్ మెహతా (Harshad Mehetha) జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఈ వెబ్‌సిరీస్‌ను 2020లో సోని లీవ్ (Sony LIV) ప్రసారం చేసింది. అయితే ఈ సిరీస్ రావడం రావడమే మంచి మౌత్ టాక్‌తో వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. హర్షల్ మెహతా (Harshal Mehetha) దీనికి దర్శకత్వం వహించాడు. ఇక రీసెంట్గా ఆయన నిర్మాణ సంస్థలో తుషార్ (Tushar) దర్శకత్వంతో మరో స్కామ్ కథ వచ్చిన విషయం తెలిసిందే.
స్కామ్ 2003: ది తెల్గీ స్టోరీ (Scam 2003: The Telgi Story) అంటూ వచ్చిన ఈ వెబ్ సిరీస్ 2003లో ఫేక్ స్టాంప్ పేపర్స్(Fake Stamp Papers) సృష్టించి బ్యాంకులను, ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసిన ‘అబ్దుల్ కరీం తెల్గి’ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కింది. రెండు భాగాలుగా రూపొందిన ఈ సిరీస్‌కు సంబంధించి అయిదు ఎపిసోడ్స్ కలిగిన ( మొదటి పార్ట్-1) మాత్రమే మేకర్స్ విడుదల చేశారు. సెప్టెంబరు 2 నుంచి సోని లీవ్‌లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్ మంచి టాక్ తెచ్చుకుంది. ఇక తొలి పార్ట్ చూసిన వారందరూ పార్ట్-2 ఎప్పుడు వస్తుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే స్కామ్ 2003 ఫ్యాన్స్‌కు మేకర్స్ గుడ్‌న్యూస్ ఇచ్చారు. ‘స్కామ్ 2003’ పార్ట్-2 ఓటీటీలో విడుదల చేశారు. సోని లీవ్‌లో ప్రస్తుతం ఈ సిరీస్‌కు సంబంధించిన అన్ని ఎపిసోడ్స్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఈ విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియాలో వెల్లడించారు.
అప్లాస్ ఎంటర్టైనమెంట్స్, స్టూడియో నెక్స్ట్ సంయుక్తగా నిర్మిస్తున్న ఈ వెబ్‌సిరీస్‌లో గగన్ దేవ్ రియర్, అనిరుద్ధ్ రాయ్, సత్యం శ్రీవాస్తవ, విశాల్ సి. భరద్వాజ్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.