Soothravakyam | మలయాళం నుంచి వచ్చిన ‘సూత్రవాక్యం’ చిత్రం ఓటీటీలో దూసుకుపోతోంది. ఈ సినిమాలో షైన్ టామ్ చాకో, విన్సీ ఆలోషియస్, దీపక్ పరంబోల్, శ్రీకాంత్ కాండ్రేగుల వంటి నటీనటులు ప్రధాన పాత్రల్లో నటించారు. యూజియన్ జోస్ చిరామ్మెల్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇటీవల థియేటర్లలో విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే తాజాగా ఈ చిత్రం ప్రైమ్ వీడియోలో 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ దాటి అరుదైన రికార్డును సొంతం చేసుకుందని చిత్ర బృందం ప్రకటించింది. ఇందులో నటుడు షైన్ టామ్ చాకోతో పాటు టాలీవుడ్ నిర్మాత శ్రీకాంత్ కాండ్రేగుల కూడా కీలక పాత్రలో నటించి మెప్పించారు. ముఖ్యంగా స్కూల్ పిల్లలతో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పోలీస్ ఆఫీసర్ అయిన క్రిస్టో జేవియర్ (షైన్ టామ్ చాకో) తన డ్యూటీతో పాటు, గ్రామంలోని పేద పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటాడు. పిల్లలు బడి మానేసి క్రిస్టో పాఠాలు వినడానికి వస్తుండటంతో, స్కూల్ టీచర్ నిమిషా (విన్సీ) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తుంది. ఈలోగా క్రిస్టో దగ్గర ట్యూషన్‌కు వచ్చే అమ్మాయి ఆర్య (అనఘ)ను ఆమె సోదరుడు వివేక్ (దీపక్ పరంబోల్) కొట్టడం చూసి క్రిస్టో అతడిని హెచ్చరిస్తాడు. ఆర్య తన బాయ్‌ఫ్రెండ్ అఖిల్ (నసీఫ్ పీపీ)తో మాట్లాడుతుండటం చూసి వివేక్ తట్టుకోలేకపోతాడు. దాంతో ఆర్య, అఖిల్ ఇద్దరిపైనా దాడి చేస్తాడు. ఈ సంఘటన తర్వాత వివేక్అ దృశ్యమవుతాడు. వివేక్‌ను వెతకడానికి క్రిస్టో జేవియర్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టగా, ఊహించని విధంగా మరో హత్య కేసు బయటపడుతుంది. ఆ హత్యకు గురైన అమ్మాయి ఎవరు? ఆమె మరణానికి, వివేక్ అదృశ్యానికి ఏదైనా సంబంధం ఉందా? ఈ మిస్సింగ్, మర్డర్ కేసులను క్రిస్టో జేవియర్ ఎలా ఛేదించాడు? చివరికి నిందితులను ఎలా పట్టుకున్నాడు? అన్నదే ఈ సినిమా కథ.