కొత్తగూడెం అర్బన్, సెప్టెంబర్ 17 : విశ్వకర్మలు అద్భుత మైన నైపుణ్యం కలవారని, తమలోని అద్భుతమైన కలను ఎన్నో శతాబ్దాల కిందటే ప్రపంచానికి చాటి చెప్పారని భవన నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు గాజుల రామచందర్ అన్నారు. బుధవారం కూలీ లైన్ లోని భవన నిర్మాణ సంఘం సెంట్రల్ హాల్ లో పట్టణ కార్పెంటర్ వర్కర్ యూనియన్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కళా నైపుణ్యం విశ్వకర్మల సొంతం అన్నారు. విశ్వకర్మలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంక్షేమ సంఘం జిల్లా ముఖ్య నాయకులు బండ్ల కృష్ణ, నమోజు గోవిందా చారి, కార్పెంటర్ యూనియన్ పట్టణ అధ్యక్షుడు పోలోజు శివ కృష్ణమాచారి, కార్యదర్శి అంబుల రామాచారి, కీసరి రిజివేంద్ర చారి, యాలగందుల రామాచారి, కపర్తి ప్రసాద్, అనాసి శ్రీనివాస్, సుంకోజు రాజు, మల్యాల కనకాచారి, పెద్దొజు నాగాచారి, చెప్పా వెంకటేశ్వర రావు, మొతుకురి నరేశ్ పాల్గొన్నారు.