కారేపల్లి, సెప్టెంబర్ 17 : ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి మండల భాగ్యనగర్ తండాకి చెందిన రైల్వే సబ్ కాంట్రాక్టర్ గుగులోత్ వెంకట్రావు (51) గుండెపోటుతో మరణించారు. వైరా నియోజకవర్గ తాజా, మాజీ ఎమ్మెల్యేలు మాలోత్ రాందాస్ నాయక్ లావుడియా రాములు నాయక్ లు వెంకట్రావు మృతదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, మాజీ జడ్పీటీసీ వాంకుడోత్ జగన్ నాయక్, సొసైటీ వైస్ చైర్మన్ ధరవత్ మంగిలాల్, డైరక్టర్ బానోత్ హిరాలాల్, మాజీ సర్పంచ్ ఇస్లావత్ సుజాత బన్సీలాల్, ఏఎంసీ మాజీ డైరెక్టర్ వాంకుడొత్ నరేశ్, నాయకులు అజ్మీర వీరన్న, బానోత్ రాందాస్, భూక్య కిషన్, భూక్య మోతిలాల్, జర్పుల ప్రసాద్, హరిదాస్ ,వాంకుడోత్ విజయ్, భూక్య రాంకిషోర్ పాల్గొన్నారు.
Karepally : గుగులోత్ వెంకట్రావుకు తాజా, మాజీ ఎమ్మెల్యేల నివాళి