Tribanadhari Barbarik | బాహుబలి ఫేం సత్యరాజ్ (Satyaraj) లీడ్ రోల్ రోల్లో నటిస్తున్న చిత్రం త్రిబాణధారి బార్బరిక్ (Tribanadhari Barbarik). మైథలాజికల్ కాన్సెప్ట్‌తో వస్తోన్న ఈ చిత్రానికి మోహన్ శ్రీవత్స దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షేర్ చేసిన టైటిల్ గ్లింప్స్ నెట్టింట హల్ చల్ చేస్తోంది. మరోవైపు సత్యరాజ్ పోషిస్తున్న డ్యాక్టర్ శ్యామ్ కథు పాత్ర లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముందుగా ప్రకటించిన ప్రకారం టీజర్ లాంచ్ చేశారు మేకర్స్.
స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయంటూ మొదలైంది టీజర్. గిది నువ్వో నేనో చేసే పని కాదు.. ధిమాకున్నోడు చేయాలే. ఒకడు తాచుపాము తోకను తొక్కాడు. ఆ పాము తొక్కినవాడిని కాటేయబోతుంది. మరి తొక్కించిన వాడి సంగతేంటి..? అంటూ సాగుతున్న సంభాషణలు సినిమాపై క్యూరియాసిటీ పెంచుతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సత్యరాజ్ బార్బరిక్ పాత్రలో జీవించేశాడని టీజర్ క్లారిటీ ఇచ్చేస్తుంది.
ఈ మూవీలో వశిష్ఠ ఎన్ సింహా, సంచి రాయ్, సత్యం రాజేశ్, క్రాంతి కిరణ్, వీటీవీ గణేశ్, మొట్ట రాజేంద్ర, ఉదయ భాను ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని టాలీవుడ్ డైరెక్టర్ మారుతి (Maruthi) సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయ్‌పాల్ రెడ్డి అడిధాలా నిర్మిస్తున్నారు. పోషిస్తున్నారు.
ఈ సినిమా భీముడు మనవడు, ఘటోత్కచుడు కుమారుడు బార్బరిక్ కథ ఆధారంగా వస్తోంది. ఎవరు తాతా ఇతను..? అని చిన్నారి అడుగగా.. ప్రపంచం గుర్తించని గొప్ప యోధుడమ్మా.. భీష్ముడా తాతా..? హహ కాదమ్మా.. అంటూ సాగే డైలాగ్స్‌తోపాటు మాధవా.. వెయ్యేనుగుల బలశాలి భీముడికి మనవడిని. ఘటోత్కచుడుకు కుమారుడిని అంటూ బార్బరిక్ పాత్ర ఇంట్రడక్షన్ వీడియో సినిమాపై అంచనాలు పెంచుతోంది.
త్రిబాణధారి బార్బరిక్ టైటిల్ గ్లింప్స్..
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్