Sasivadane | ‘పలాస 1978’ సినిమాతో యాక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు యువ హీరో రక్షిత్ (Rakshit Atluri). ఈ యంగ్ హీరో నటించిన చిత్రాల్లో ఒకటి శశివదనే (Sasivadane). రొమాంటిక్ ఎంటర్టైనర్గా సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కోమలీ ప్రసాద్ (Komalee Prasad) ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది.
ఈ ఏడాది అక్టోబర్ 10న థియేటర్లలో విడుదలైన శశివదనే బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఇంప్రెస్ చేయలేకపోయింది. ఇక ఓటీటీలో తన లక్‌ను పరీక్షించుకునేందుకు రెడీ అయింది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫాం సన్ నెక్ట్స్‌లో నవంబర్ 28న ప్రీమియర్ కానుంది.
ఈ మూవీలో ప్రవీణ్ యెండమూరి, తమిళ నటుడు శ్రీమాన్, కన్నడ యాక్టర్ దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలకపాత్రలు పోషించారు. గౌరీ నాయుడు సమర్పించిన ఈ చిత్రాన్ని ఎస్వీఎస్ కన్స్ట్రక్షన్స్, ఏజీ ఫిలిం కంపెనీతో కలిసి అహితేజ బెల్లంకొండ నిర్మించారు. మరి ఓటీటీలో ఎలాంటి స్పందన రాబట్టుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.
One love. One promise. One unforgettable story. 💫 Sasivadane premieres Nov 28 — only on Sun NXT. He loved once… and forever. ❤️ #Sasivadane #SunNXT #LoveStory #OnePromiseForever #NewPremiere #TeluguCinema #RomanticTales… pic.twitter.com/OLZ6ptHrWM
— SUN NXT (@sunnxt) November 23, 2025
AR Rahman | మతం పేరుతో చంపడం చాలా తప్పు.. ఇస్లాం మతంలోకి వెళ్లడానికి కారణం ఇదే: ఏఆర్ రెహమాన్