Sarkaru vaari paata Update | సూపర్ స్టార్ మహేశ్ బాబు కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఉత్సాహంగా షూటింగ్‌కు సిద్ధమవుతున్నారు. ఆయన నటిస్తున్న సర్కారు వారి పాట సినిమా చిత్రకరణ కొత్త షెడ్యూల్‌కు సన్నాహాలు చేసుకుంటోంది. ఈ షెడ్యూల్లో మహేశ్ బాబు జాయిన్ కాబోతున్నారు. దర్శకుడు పరశురామ్ పెట్ల రూపొందిస్తున్న సర్కారు వారి పాట సినిమా మరో నెలన్నరలో షూటింగ్ కంప్లీట్ చేసుకోనుంది. ఇది పెద్ద కథ కావడంతో చిత్రీకరణకు ఎక్కువ సమయం పడుతోంది.
కరోనా రెండు వేవ్ ల వల్ల షూటింగ్ వాయిదా పడుతూ వచ్చింది. ఇటీవల మహేశ్ బాబుకు కొవిడ్ సోకడం, ఆ తర్వాత కీర్తి సురేశ్ కూడా వైరస్ బారిన పడటంతో కొత్త షెడ్యూల్ ఆలస్యమవుతూ వచ్చింది. థర్డ్ వేవ్ నుంచి ఇండస్ట్రీ కోలుకుంటున్న ఈ టైమ్‌లో భారీ షెడ్యూల్‌కు యూనిట్ సిద్ధమవుతోంది. ఈ షెడ్యూల్లో సినిమా మేజర్ పార్ట్ పూర్తి చేయబోతున్నారు. 14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సర్కారు వారి పాట చిత్రంలో మహేశ్ బాబు ప్రొడక్షన్ కూడా భాగస్వామిగా వ్యవహరిస్తోంది.
బ్యాంకింగ్ రంగ నేపథ్యంతో యాక్షన్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు థమన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రంలోని తొలి లిరికల్ సాంగ్ ను ఫిబ్రవరి 14న వాలైంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. సుబ్బరాజు, వెన్నెల కిషోర్, సముద్రఖని ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. సర్కారు వారి పాట చిత్రీకరణలో ఫిబ్రవరి 2 తేదీ నుంచి మహేశ్ బాబు చేరబోతున్నారు. ఈ షెడ్యూల్‌తో మహేశ్ బాబు తన పార్ట్ కంప్లీట్ చేస్తారని సమాచారం.
మరోవైపు సినిమా చిత్రీకరణతో పాటు సమాంతరంగా నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ముందుగా ఈ సినిమాకు ఏప్రిల్‌లో విడుదల తేదీ అనుకున్నా, అది మరికాస్త ఆలస్యమయ్యేలా ఉంది. ఏదైనా చిత్ర బృందం నుంచి అధికారికంగా ప్రకటన వచ్చేవరకు వేచి చూడాలి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Follow us on Google News
పదేండ్ల క్రితం మన హీరోలు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలిస్తే షాకవుతారు?
త్రివిక్రమ్ సినిమాలో మహేశ్ మరదలిగా ఆ మలయాళ బ్యూటీ?
మహేశ్ బాబు చెల్లిగా సాయి పల్లవి.. కాంబినేషన్ అదుర్స్ కదూ..
Maheshbabu | సర్కారు వారి పాటకు మహేష్‌బాబు పారితోషికం తెలుసా?
Keerthy Suresh New Talent | కొత్త టాలెంట్ చూపించబోతున్న కీర్తిసురేశ్..!