ప్రస్తుతం సర్కారు వారి పాట (Sarkaru Vaari Paata) చిత్రంతో బిజీగా ఉంది కోలీవుడ్ (Tollywood) హీరోయిన్ కీర్తిసురేశ్ (Keerthy Suresh). షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ త్వరలోనే చిత్రీకరణ పూర్తి చేసుకోనుంది. మహేశ్ బాబు, కీర్తిసురేశ్ తొలిసారి సిల్వర్ స్క్రీన్‌పై కలిసి మెరువనుండటంతో సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా..? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు సినీ జనాలు. ఇప్పటివరకు హీరోయిన్గా టాలెంట్‌ను చూపించిన కీర్తిసురేశ్ తనలోని వయోలినిస్ట్ (violinist)ను కూడా ప్రేక్షకులకు చూపించబోతుంది.
సర్కారు వారి పాట కోసం వయోలినిస్టుగా అవతారమెత్తింది కీర్తిసురేశ్. పంజాబీ డ్రెస్‌లో ఉన్న కీర్తిసురేశ్ సోఫాలో కూర్చొని వయోలిన్ చేత పట్టుకొని ఉన్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. కీర్తిసురేశ్ మ్యూజికల్ సర్ప్రైజ్ ఇవ్వబోతుందని ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ థమన్ (S.S.Thaman). కీర్తిసురేశ్ ఇందులో పాట మాత్రం పాడటం లేదని, వయోలిన్ వాయించడం మాత్రం పక్కా అని చెప్పాడు థమన్. కీర్తిసురేశ్‌కు వయోలిన్ వాయించడం బాగా తెలుసు. పలు సందర్భాల్లో వయోలిన్ వాయించి అందరినీ ఆకట్టుకుంది.
సినిమాకు సంబంధించిన ఓ ప్రమోషనల్ సాంగ్‌లో కీర్తిసురేశ్ మ్యూజికల్ టాలెంట్‌ను చూపించబోతున్నారని, త్వరలోనే ఆ బిట్ రిలీజవుతుందని టాక్ వినిపిస్తున్నా..దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా
Bad Luck Sakhi video song | పల్లెటూరి సరదాలతో ‘బ్యాడ్ లక్ సఖి ‘ వీడియో సాంగ్
Malaika Arora | మలైకా వల్ల అర్జున్ కపూర్ హ్యాపీగా ఉంది అప్పుడేనట..!