Saripodhaa Sanivaaram | టాలీవుడ్ స్టార్ న్యాచురల్ స్టార్ నాని (Nani) సరిపోదా శనివారం (Saripodhaa Sanivaaram) సినిమాతో హిట్ అందుకున్నాడని తెలిసిందే. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై.. ఇతర భాషల్లో Suryas Saturday టైటిల్‌తో రిలీజయింది. ఆ తర్వాత ఓటీటీలో కూడా విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది.
కాగా యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ చిత్రం ఇక జపనీస్ భాషలో కూడా సందడి చేసేందుకు రెడీ అయింది. సరిపోదా శనివారం 2025 ఫిబ్రవరి 14న జపాన్‌లో గ్రాండ్‌గా విడుదలవుతున్నట్టు ప్రకటించారు మేకర్స్. జపాన్‌లో Saturday Man టైటిల్‌తో విడుదల కానుంది. ఇప్పటికే బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. మరి జపనీయులు ఈ సినిమాను ఎలా రిసీవ్ చేసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
ఈ చిత్రంలో గ్యాంగ్ లీడర్ ఫేం ప్రియాంక ఆరుళ్ మోహన్ హీరోయిన్గా నటించగా.. కోలీవుడ్ స్టార్ యాక్టర్ ఎస్జే సూర్య (SJ Suryah) కీలక పాత్రలో నటించాడు. యూనిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ మూవీకి జేక్స్ బిజోయ్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించాడు. ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై డీవీవీ దానయ్య నిర్మించారు.
#SaripodhaaSanivaaram : General Release in Japan on February 14, 2025 due to popular demand.
Japanese title – “Saturday Man”#Nani • #SJSuryah • #VivekAthreya pic.twitter.com/m7AQc9xyBS
— Movies4u Official (@Movies4u_Officl) February 4, 2025
Read Also :
L2 Empuraan | తొలి సినిమాగా.. రిలీజ్‌కు ముందే మోహన్ లాల్ L2E అరుదైన రికార్డ్
Sairam Shankar | విలన్ ఎవరో చెప్పండి.. రూ.10 వేలు గెలుచుకోండి.. సాయి రామ్ శంకర్ బంపర్ ఆఫర్