Sandhya Theatre Stampede | తొక్కిసలాట ఘటన (Sandhya Theatre Stampede)కు సంబంధించి సంధ్య థియేటర్ యజమాన్యం నాంపల్లి కోర్టును ఆశ్రయించింది. ఈ ఘటనలో సంధ్య థియేటర్ యజమాన్యం తాజాగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. థియేటర్ యజమానులు ఏ1 పెద్దరామిరెడ్డి, ఏ2 చిన్నరామిరెడ్డి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
ఈ మేరకు కౌంటర్ దాఖలు చేయాలని చిక్కడపల్లి పోలీసులకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు కాసేపట్లో కౌంటర్ దాఖలు చేయనున్నారు.
అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్పై తీర్పు..
ఈ కేసులో పుష్ప 2 ది రూల్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును శుక్రవారానికి వాయిదా వేయగా.. మరోవైపు ఇదే కేసులో బన్నీకి హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.
Shankar | రాంచరణ్ ఏది అడిగినా చేసేందుకు ఒప్పుకున్నాడు.. గేమ్ ఛేంజర్ ఈవెంట్లో శంకర్