ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి, తెలుగు నటి సంధ్యారాజుకు అరుదైన గౌరవం దక్కింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో నిర్వహించే ‘ఎట్ హోమ్’ వేడుకలకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నుంచి సంధ్యారాజుకు ఆహ్వానం అందింది. తొలిచిత్రం ‘నాట్యం’తో రెండు జాతీయ అవార్డులను దక్కించుకుంది సంధ్యారాజు.
హైదరాబాద్‌లో నిశృంఖల డ్యాన్స్ ఆకాడమీని స్థాపించి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా అనేక నృత్య కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు సినీరంగంలో నటిగా రాణిస్తున్నారు. ‘ఎట్‌హోమ్’ కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందడం గొప్ప గౌరవంగా భావిస్తున్నానని సంధ్యారాజు ఆనందం వ్యక్తం చేసింది.