‘యానిమల్’ జోరు చూస్తుంటే వెయ్యికోట్లను ఈజీగానే టచ్ చేసేలావుంది. పెద్దపెద్ద స్టార్‌హీరోలు, దర్శకులు సైతం సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వ శైలిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం హీరోలంతా సందీప్‌రెడ్డి కోసం చూస్తుంటే.. తను మాత్రం మెగాస్టార్ వైపు చూస్తున్నాడు. ఆయనకు చిరంజీవిని డైరెక్ట్ చేయాలనుందంట.
ఈ కోరికను ‘యానిమల్’ ప్రమోషన్లో భాగంగా అమెరికాలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో వెల్లడించాడు సందీప్‌రెడ్డి. ‘నాకు చిరంజీవిగారిని డైరెక్ట్ చేయాలనుంది. అవకాశం వస్తే ఆయనతో ఓ యాక్షన్ డ్రామా తీస్తా. అభిమానులకు కొత్త చిరంజీవిని చూపిస్తా’ అని చెప్పుకొచ్చాడు సందీప్‌రెడ్డి. నిజానిక్కూడా ఇది ఎవరూ ఊహించని కాంబినేషన్. అదే జరిగితే అభిమానులకు విజువల్ ఫీస్టే.