Black Gold | భీమ్లా నాయక్ ఫేం మలయాళ బ్యూటీ సంయుక్తా మీనన్ తొలిసారి హీరోయిన్ సెంట్రిక్ సినిమాతో వస్తోన్న విషయం తెలిసిందే. యోగేశ్ కేఎంసీ డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కొనసాగుతున్న ఈ చిత్రానికి ఇప్పటికే బ్లాక్ గోల్డ్ టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టు తెలియజేస్తూ లుక్ విడుదల చేశారు.
ముందుగా ప్రకటించిన ప్రకారం బ్లాక్ గోల్డ్ ఫస్ట్‌లుక్ విడుదల చేశారు మేకర్స్. ప్రయాణికులెవరూ లేని రైల్వే ప్లాట్ ఫాంపై సంయుక్తా మీనన్ రౌడీ మూకలను ఊచకోత కోసినట్టు కనిపిస్తున్న పోస్టర్ సినిమా చూసిన ప్రేక్షకులకు రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయమని చెప్పకనే చెబుతోంది.
బొగ్గు షేడ్స్ బ్యాక్ డ్రాప్లో రాళ్లతో డిజైన్ చేసినట్టుగా ఉన్న టైటిల్ లుక్ మధ్యలో నాట్యం చేస్తున్న ప్రతిమ కనిపిస్తుంది. మొత్తానికి ఈ సినిమా నల్లబంగారం (బొగ్గు)చుట్టూ తిరుగుతుందని డైరెక్టర్ హింట్ ఇచ్చినట్టు టైటిల్ లుక్ చెప్పకనే చెబుతోంది. ఈ మూవీని హాస్య మూవీస్, మాగంటి పిక్చర్స్ బ్యానర్లపై సంయుక్తంగా రాజేశ్ దండా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
ఏ వసంత్ సినిమాటోగ్రఫర్, చోటా కే ప్రసాద్ ఎడిటింగ్. ఈ చిత్రానికి సంయుక్తామీనన్ సమర్పకురాలిగా కూడా వ్యవహరిస్తుండటం విశేషం.
Happy Diwali to everyone ❤️
Presenting #TheBlackGoldFirstLook on this auspicious occasion 🤗
A film that’s incredibly close to my heart… one that promises to take you on a journey full of action, emotion, intensity, and heartwarming moments ❤️🔥
This is just the beginning…… pic.twitter.com/eoE4g8Vxfk
— Samyuktha (@iamsamyuktha_) October 20, 2025