సినీ లవర్స్ చాలా ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్న టాలీవుడ్ (Tollywood) ప్రాజెక్టుల్లో ఒకటి భీమ్లా నాయక్ (Bheemla Nayak). ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథ, స్క్రీన్ ప్లే సమకూరుస్తుండగా..సాగర్ చంద్ర (Sagar Chandra) దర్శకత్వం వహిస్తున్నాడు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ చేస్తుండగా, రానా (Rana) డానియల్ శేఖర్‌గా నటిస్తున్నాడు. పవన్‌కల్యాణ్‌కు జోడీగా నిత్యమీనన్ నటిస్తోంది.
కాగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి చాలా రోజులుగా సస్పెన్స్ లో కొనసాగుతున్న ఓ క్రేజీ అప్డేట్పై క్లారిటీ వచ్చింది. భీమ్లా నాయక్‌లో మరో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపించనున్నారనే దానిపై ఇప్పటికే పలు వార్తలు తెరపైకి వచ్చాయి. మొదట ఐశ్వర్యారాజేశ్ ను ఎంపిక చేశారని, ఆ తర్వాత ఆమె భీమ్లా నాయక్ ప్రాజెక్టు నుంచి తప్పుకుందని వార్తలు వచ్చాయి.
We welcome aboard the charming @iamsamyuktha_ to the #BheemlaNayak Family! ♥️@pawankalyan @RanaDaggubati #Trivikram @saagar_chandrak @MenenNithya @MusicThaman @dop007 @NavinNooli @vamsi84 @sitharaents @adityamusic pic.twitter.com/L0b3x3ZZBf
— Sithara Entertainments (@SitharaEnts) October 28, 2021
మొత్తానికి మేకర్స్ సస్పెన్స్ కు తెరదించుతూ ఆ భామ ఎవరో అధికారికంగా ప్రకటించారు. మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తామీనన్ (Samyukta Menon)ను కీలక పాత్ర కోసం ఎంపిక చేసినట్టు ట్విటర్ ద్వారా షేర్ చేశారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Aryan Khan bail | టాప్ లాయర్‌తో ఈ సారైనా ఆర్యన్‌కు బెయిల్ వచ్చేనా..?
RRR huge Update | అక్టోబర్ 29న రెడీగా ఉండండి..ఆర్ఆర్ఆర్ టీం ట్వీట్